టాలీవుడ్ “థ్రిల్లర్” మూవీస్!!!

టాలీవుడ్ సినిమా అనేది ఎప్పటికప్పుడు రంగు మార్చుకుంటూ ఉంది. అప్పట్లో సంగీతం, నృత్యం ఆధారంగా సినిమాలు వచ్చాయి. అవి భారీ హిట్స్ సాధించి టాలీవుడ్ సినీ చరిత్రకే సరికొత్త అర్ధాన్ని తెచ్చిపెట్టాయి. జానపద, సాంఘిక, రాజకీయ, ఫ్యాక్షన్ కధల ఆధారంగా సైతం ఎన్నో సినిమాలు టాలీవుడ్ తెరపై తైతక్కలు ఆడాయి. ఇక అదే క్రమంలో కొందరు దర్శకులు థ్రిల్లర్స్ తో టాలీవుడ్ ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం సైతం చేశారు. కధను, కధనాన్ని తమదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను థ్రిల్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపించారు. చిన్న సినిమా…పెద్ద సినిమా, చరిష్మా ఉన్న హీరో, ఎంట్రీ ఇచ్చిన యువ హీరో, ఇలా కాంబినేషన్ ఏదైనా “థ్రిల్లర్స్” కు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. మరి అలాంటి థ్రిల్ చేసిన థ్రిల్లింగ్ సినిమాలను కొన్నింటిని ఒక లుక్ వేద్దాం రండి.

అన్వేషణ

Anveshana,Tollywood Thriller Moviesకార్తీక్, భాను ప్రియ కీలక పాత్రల్లో, వంశీ సంధించిన ఈ చిత్రం అప్పట్లో అద్భుతమైన విజయాన్నే సాధించడం కాకుండా, థ్రిల్లర్స్ కే థిల్లర్ గా నిలిచింది.

క్షణ క్షణం

Tollywood Thriller Movies,Kshna Kshanam Moviవెంకటేష్ శ్రీదేవి ముఖ్య పాత్రల్లో అప్పట్లో  రామ్ గోపాల్ వర్మ సండించిన బాణం ఈ చిత్రం. మంచి హిట్ తో విమర్శకుల ప్రశంసలు సైతం అనుకుంది ఈ చిత్రం.

ఏ ఫిల్మ్  బై అరవింద్

Tollywood Thriller Movies,A Film By Aravindజరగబోయే కధను వివరిస్తూ ఒక దర్శకుడు, హీరో కలసి చేసిన ప్రయాణంలో ఎదురైన పరిణామాలను అద్భుతంగా ఆవిష్కరించాడు దర్శకుడు. చిన్న సినిమా అయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

అనుకోకుండా ఒక రోజు

Tollywood Thriller Movies,Anukokunda Oka Rojuచంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. అనుకోకుండా రెండు హత్యలకు సాక్షిగా మారిన హీరోయిన్ కధను అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు.

మంత్ర

Tollywood Thriller Movies,Mantra Movieరెండు హత్యల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం కీలక పాత్ర పోషించిన చార్మికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

డేంజర్

Tollywood Thriller Movies,Danger Movieకృష్ణ వంశీ దర్శకత్వంలో యువ హీరోలు, అందాల తారలతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా శబ్ధం చేయనప్పటికీ విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది.

అనసూయ

Tollywood Thriller Moviesప్రేమ విఫలమైన ఒక భగ్న ప్రేముకూడి కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు రవిబాబు టెక్నికల్ గా అద్భుతంగా తెరకెక్కించారు.

అమరావతి

Tollywood Thriller Movies,Amaravathi Movieరవిబాబు దర్శకత్వంలో భూమిక, తారకరత్న, స్నేహ కీలక పాత్రలో వచ్చిన చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది.

1 నేనొక్కడినే

Tollywood Thriller Movies,1 Nenokkadineప్రిన్స్ మహేష్ ను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ దర్శకుడు సుకుమార్ అందించిన థ్రిల్లర్ ఇది.

కార్తికేయ

Tollywood Thriller Movies,Karthikeyaయువ హీరో నిఖిల్, అందాల భామ స్వాతిని కలిపి చందూ మోండేటి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్నలను, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ను మాత్రమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

దృశ్యం

Tollywood Thriller Movies,Drishyam Movieశ్రీ ప్రియ దర్శకత్వంలో వెంకటేష్, మీన ముఖ్య పాత్రల్లో తమిళ దృశ్యాన్ని తెలుగులోకి రీమేక్ చేశారు. ఇక చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ భారీ హిట్ ను సాధించి కల్‌క్షన్ల ప్రభంజనాన్ని సృష్టించింది.

క్షణం

Tollywood Thriller Movies,Kshanamరవికాంత్ పేరేపు దర్శకత్వంలో, అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

Share.