ఈ హీరోయిన్లు వెబ్ సిరీస్ లకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు..!

ప్రస్తుతం టాప్ హీరోయిన్లు అలాగే మీడియం రేంజ్ ఉన్న హీరోయిన్లంతా వెబ్ సిరీస్ ల బాట పడుతున్నారు. ఇంత సడెన్ గా ఎందుకు ఇలా డిసైడ్ అయ్యారా అని అంతా షాక్ అవుతున్నారు. దర్శకనిర్మాతలు భారీ పారితోషికాలు ఆఫర్ చేయడంతో పాటు ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఉండడం వలెనే ఇలాంటి డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సినిమాల్లో అయితే ఎక్కడో ఓ రెండు మూడు నిమిషాల్లో మాత్రమే కనిపించే అవకాశం ఉంటుంది.. అదే వెబ్ సిరీస్ లలో అయితే అలా కాదు.. పైగా మంచి పాత్రలు కూడా దొరకడం కూడా ఒకింత కారణమని సమాచారం.

Tollywood Star Actress

ఇప్పటికే అక్కినేని వారి కోడలు సమంత వెబ్ సిరీస్ లో నటించేస్తుంది. ‘ఫ్యామిలీ మ్యాన్’ సెకండ్ సీజన్ లో ఈమె నటిస్తున్నట్టు తెలుస్తుంది. కోలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ కూడా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇప్పుడు కాజల్ సైతం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు భోగట్టా..! ఇక మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కూడా ‘వికటన్ గ్రూప్’ వారు నిర్మించే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కూడా ఇదే మార్గంలో నడుస్తుంది. ఇక రాధిక ఆప్టే- నీహారిక కొణిదెల- ఇషా రెబ్బా – ప్రియమణి- మంజరి ఫడ్నిస్- స్వరా భాస్కర్.. వంటి వారు ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటించిన అనుభవంతో ఇప్పుడు మరిన్ని వెబ్ సిరీస్ లు మొదలుపెట్టేసినట్టు తెలుస్తుంది. రానున్న కాలంలో ఈ ట్రెండ్ మరింత ఊపందుకునే అవకాశం ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.