సంపూర్ణేష్ బాబు అంత గొప్ప నటుడు నాగబాబు : త్రిపురనేని విజయ్ చౌదరి

మొన్నటికి మొన్న బాలకృష్ణ ఇండస్ట్రీ పెద్దల పై వేసిన సెటైర్లు పెద్ద దుమారాన్నే లేపాయి. లాక్ డౌన్ వల్ల సినీ ఇండస్ట్రీ బాగా నష్టపోయింది.. దానిని ఆదుకోవాలి.. తిరిగి షూటింగ్ లకు పెర్మిషన్ల తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, దిల్ రాజు, సి.కళ్యాణ్ వంటి ఇండస్ట్రీ పెద్దలు మంత్రి తలసానితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ‘ఈ మీటింగ్ ల గురించి నాకు తెలీదు.. ఎవ్వరూ నన్ను పిలవలేదు.. తలసానితో రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నారా’ అని బాలయ్య వారిని విమర్శించాడు. దీనికి నాగబాబు బాలయ్యను.. ‘నోరు అదుపులో పెట్టుకోవాలని.. తెలంగాణ ప్రభుత్వానికి కూడా క్షమాపణలు చెప్పాలని’ నాగబాబు చెప్పుకొచ్చాడు.

ఇక నాగబాబు కామెంట్స్ పై ఎలాగూ బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ అవుతారు అని ముందే ఊహించడం సహజం.. కానీ ఇప్పుడు ఓ యంగ్ డైరెక్టర్ కూడా నాగబాబు ఫైర్ అవుతూ కామెంట్స్ చేసాడు. సుప్రసిద్ధ రచయిత త్రిపురనేని మహారథి మనవడు విజయ్ చౌదరి నాగబాబు పై తెగ ఫైర్ అయ్యాడు. విజయ్ చౌదరి మాట్లాడుతూ.. “నాగబాబు.. నువ్వు సంపూర్ణేష్ బాబు అంత పెద్ద నటుడువి. ఇండస్ట్రీలో ఉన్నక్యారెక్టర్ ఆర్టిస్ట్స్ అందరినీ లైన్లో నిలబెడితే వెనకనుండి మొదట ప్లేస్ లో ఉండే నువ్వు బాలయ్య బాబు పై సెటైర్ లు వేస్తుంటే.. ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకోరు. నువ్వు చిరంజీవి తమ్ముడివి .. పవన్ కళ్యాణ్ అన్న వి కాకపోతే నీకు అసలు గుర్తింపే లేదు.

నువ్వు ఇండస్ట్రీకి చేసిన గొప్ప ఏంటి..? బాలయ్య బాబుని పిలవకుండా మీటింగ్స్ జరిపే అంత కెపాసిటీ ఉందా మీకు..? మీ అన్న చిరంజీవి కూడా హీరో మాత్రమే.. ఇండస్ట్రీ మొత్తం మీ ఫ్యామిలీది అనుకుంటున్నారా? బాలయ్య బాబుని మీటింగులకు పిలవాల్సిన భాద్యత మీదే. బాలయ్యని… ‘నువ్వేమి కింగ్ కాదు’ అంటున్నావ్.. నువ్వేమన్నా కింగా..? మీ అన్నా తమ్ముడు కింగ్ లు అనుకుంటున్నారా..? మీలాగా బాలయ్య మనసులో ఒకటి పెట్టుకొని బయటకి మరొకటి చెప్పే రకం కాదు. మీ సామాజిక వర్గంలో మీరు కాకుండా ఇంకో హీరోని పైకి ఎదగనివ్వలేదు మీరు..! కేవలం మీ స్వార్థ బుద్ధి వల్ల మీ సామాజిక వర్గంలో మరో హీరోని ఎదగనివ్వకుండా తొక్కేశారు..! మీరు పెట్టిన పీఆర్పీ పార్టీకి ఫండ్స్ ఇచ్చిన మీ వర్గం వారిని నాశనం చేసిన మీరు బాలయ్య బాబు గురించి మాట్లాడతారా?” అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఇక విజయ్ చౌదరి ‘కవ్వింత’ అనే చిన్న సినిమాని తెరకెక్కించాడు.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Share.