జై లవకుశ ట్రైలర్ చూసి సినీ స్టార్స్ ఆశ్చర్యపోయారు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి త్రి పాత్రాభినయం చేస్తున్న జై లవకుశ ట్రైలర్ నిన్న రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంది. జై, లవ, కుశలను కాసేపు ఒకే ఫ్రేమ్ లో చూసేసరికి అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. వెండితెరపై ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూదామనే ఆత్రుతని ట్రైలర్ పెంచింది. సినీ స్టార్స్ కూడా జై లవకుశ ట్రైలర్ చూసి ఆశ్చర్యపోయారు. ఎన్టీఆర్ నటనను మెచ్చుకున్నారు. తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికపై పంచుకున్నారు…

విశ్వరూపం చూడాలని..
“ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు తన నటనతో ఎంతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు జై పాత్ర తో తనలోని నట విశ్వరూపాన్ని చూపబోతున్నాడు. ఎప్పుడెప్పుడు జై చూద్దామా అని ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి అల్ ది బెస్ట్ ” – రాజమౌళిrajamouli-about-jai-lava-kusa-trailer
‘సినిమా చూడడానికి చాలా ఆతృతగా ఉంది. దీనికి మించి ఇంకేమి చెప్పగలం’ – శోభూ యార్లగడ్డshobu-about-jai-lava-kusa-trailer
‘కిక్కాస్‌.. ట్రిపుల్‌ ధమాకా’ – వెన్నెల కిశోర్‌vennala-kisore-about-jai-lava-kusa-trailer
‘చ.. చ.. చంపేశావ్‌’ – సాయిధరమ్‌ తేజ్‌sai-dharam-tej-about-jai-lava-kusa-trailer
‘అదరహో..’ – రాజ్‌తరుణ్raj-tharun-about-jai-lava-kusa-trailer
‘అద్భుతమైన ట్రైలర్‌.. చిత్ర బృందానికి అభినందనలు’ – ఈషా రెబ్బాeesha-rebba-about-jai-lava-kusa-trailer
అదిరింది.. తారక్‌ ఉత్తమైన ప్రదర్శన’ – గోపీచంద్‌ మలినేనిgopi-chand-malineni-about-jai-lava-kusa-trailer


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.