ప్రేమించిన వ్యక్తులతో విడిపోయిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..?

సామాన్యులు అయినా, సెలబ్రిటీలు అయినా ఏదో ఒక సందర్భంలో ప్రేమలో పడుతుంటారు. సెలబ్రిటీలు అయితే తోటి హీరోలతో, హీరోయిన్లతో ప్రేమలో పడే అవకాశాలు ఉంటాయి. ప్రేమలో పడిన హీరోహీరోయిన్లలో కొందరు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెడితే మరి కొందరు మాత్రం వేర్వేరు కారణాల వల్ల విడిపోయారు. అలా ప్రేమలో పడి ప్రేమించిన వారితో విడిపోయిన హీరోయిన్లలో సమంత, నయనతార, రష్మిక మందన్న, శృతిహాసన్, ఇలియానా ఉన్నారు. తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపును సంపాదించుకున్న హీరో సిద్దార్థ్ తో ప్రేమలో పడిన సమంత జబర్దస్త్ అనే సినిమాలో కలిసి నటించారు.

ఆ సినిమా షూటింగ్ సమయంలో సిద్దార్థ్ సమంత ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. సిద్దార్థ్ సమంత శ్రీకాళహస్తిలో పూజలు జరిపించినట్లు ప్రచారం జరిగింది. అయితే వేర్వేరు కారణాల వల్ల సిద్దార్థ్ సమంత విడిపోగా సమంత నాలుగేళ్ల క్రితం నాగచైతన్యను వివాహం చేసుకున్నారు. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార శింబు, ప్రభుదేవాతో ప్రేమలో పడ్డారు. అయితే కొన్ని కారణాల వల్ల శింబుతో, ప్రభుదేవాతో విడిపోయిన నయనతార ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్నారు. కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ లండన్ కు చెందిన మేఖైల్ అనే వ్యక్తితో ప్రేమలో పడగా కొన్ని కారణాల వల్ల మైఖేల్ శృతి విడిపోయారు.

ప్రస్తుతం శృతి శాంతా హజారికా అనే వ్యక్తితో సన్నిహితంగా ఉన్నారని తెలుస్తోంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడగా నిశ్చితార్థం తరువాత రష్మిక రక్షిత్ విడిపోయారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న గోవా బ్యూటీ ఇలియానా ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమలో ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇలియానా ఆండ్రూ విడిపోయారని సమాచారం.

1. సమంత

2. నయనతార

1

2

3.రష్మిక మందన్న

4. శృతిహాసన్

5. ఇలియానా

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Share.