మేము ఏమాత్రం తక్కువ కాదంటున్న హీరోల భార్యలు..!

మన సౌత్ లో హీరోలు ఒక్కో సినిమాకు కోట్లకు కోట్లు పారితోషికాన్ని తీసుకుంటున్నారు. అంతేకాదు కొంతమంది స్టార్ హీరోలైతే లాభాల్లో వాటాలు తీసుకోవడం, మరికొంతమంది హీరోలు డిజిటల్ రైట్స్ లో కూడా షేర్స్ తీసుకుంటూ… ఏకంగా బాలీవుడ్ హీరోలనే మించిపోతున్నారు. కేవలం హీరోలు మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్టులు గా చేసే డిమాండ్ ఉన్న నటులు కూడా హీరోల సంపాదనకు ఏమాత్రం తగ్గడం లేదు. ఇక వీళ్ళ భార్యలు మాత్రం ఖాళీగా ఉంటున్నారు.. అని మీరనుకుంటున్నారా? అస్సలు కాదు.

మా భర్తల కంటే మేము ఏమాత్రం తక్కువ కాదు అంటూ వాళ్ళు కూడా చేతినిండా సంపాదిస్తున్నారు. సినిమాల్లో నటించకపోయినా వారికి ఆసక్తి గల రంగంలో రాణిస్తున్నారు. అయితే ఏ సెలబ్రిటీ భార్య ఎంత సంపాదిస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? రండి ఓ లుక్కేద్దాం..

1) నాని భార్య అంజనా

1nani-with-his-wife

నేచురల్ స్టార్ నాని భార్య అంజనా ఈ లిస్టులో ముందుంది. ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తుంది. బెంగళూర్ నిఫ్ట్ కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసి.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి అలాగే ‘ఆర్కా మీడియాలో’ సంస్థకు పని చేస్తుంది. అక్కడ క్రియేటివ్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా వ్యవహరిస్తుంది. ఈమె జీతం లక్షల్లో ఉంటుందని సమాచారం. ‘బాహుబలి’ కి కూడా ఈమె క్యాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం విశేషం. ఈమె సంపాదన నాని సంపాదనకు ఏమాత్రం తీసిపోదంట.

2) రాంచరణ్ భార్య ఉపాసన

2ram-charan-with-his-wife

మెగాపవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె కూడా భారీగానే సంపాదిస్తుంది. ‘హెల్త్ సెంటర్స్’ ఏర్పాటు చేసింది…. అలాగే అపోలో హాస్పిటల్స్‌లో కూడా చురుకైన పాత్ర పోషిస్తుంది. రాంచరణ్ బిజినెస్ వ్యవహారాలు కూడా దగ్గరుండి చూసుకుంతుంది ఉపాసన. చరణ్‌కు ధీటుగానే కాకుండా సాయంగా కూడా ఉంటుంది.

3) అల్లరి నరేష్ భార్య విరూప

3allari-naresh-with-his-wife

కామెడీ చిత్రాలతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న అల్లరి నరేష్. ఒక్కో సినిమాకి కోటి వరకూ తీసుకుంటూ వస్తున్నాడు. అలాగే ఆయన భార్య విరూప కూడా ఈవెంట్ మేనేజర్‌గా పని చేస్తూ… ఒక్కో ఈవెంట్ కు లక్షల్లో పారితోషికం తీసుకుంటుందట.

4) అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

4allu-arjun-with-his-wife

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పారితోషికం కూడా 10 కోట్ల పైనే ఉంటుంది. అలా అని ఆయన భార్య స్నేహ రెడ్డి లైట్ తీసుకోకుండా ‘స్పెక్‌ట్రం’ అనే మ్యాగజైన్కు ఛీఫ్ ఎడిటర్‌గా పని చేస్తుంది. ఫారెన్‌లో చదువుకున్న స్నేహ… ఇప్పుడు జాబ్ చేస్తుంది. మరోపక్క తన తండ్రి స్థాపించిన ‘సెయింట్ ఇన్స్టిట్యూట్స్’ పనులు కూడా చూసుకుంటుంది.

5) రాజీవ్ కనకాల భార్య సుమ

5rajeev-kanakala-with-his-wife

ఇప్పుడు విలక్షణ నటుడుగా కొనసాగుతున్న రాజీవ్ కనకాల అప్పట్లో కొన్ని చిత్రాల్లో హీరోగా కూడా నటించాడు. ప్రస్తతం ఆయన వరుస సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా గడుపుతున్నాడు. ఇక ఆయన భార్య యాంకర్ సుమ కూడా తన భర్తకి ఏమాత్రం తగ్గకుండా సంపాదిస్తుంది. బుల్లితెర పై యాంకర్‌గానే కాకుండా.. దాదాపు ప్రతీ స్టార్ హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకి ఈవిడే యాంకరింగ్ చేస్తూ వస్తుంది.

6) రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి

6rahul-ravindran-with-his-wife

ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి కూడా ఎక్కువే సంపాదిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే తన భర్తకంటే ఎక్కువ సంపాదిస్తుంది. గాయనిగా .. డబ్బింగ్ ఆర్టిస్టుగా చిన్మయి సంపాదన కూడా కోటి వరకూ ఉంటుంది.

7) రాజశేఖర్ భార్య జీవిత

7rajashekar-with-his-wife

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ భార్య జీవిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన భర్త సంపాదనకి ఏమాత్రం తీసిపోకుండా ఈమె కూడా సంపాదిస్తుంది. ఈమె సెన్సార్ బోర్డు మెంబర్ గా కూడా పనిచేస్తుంది.

8) నాగ చైతన్య భార్య సమంత

8naga-chaitanya-with-his-wife

అక్కినేని నాగచైతన్య భార్య సమంత సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పాలా. అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే పెళ్ళైన తరువాత ఈమె సంపాదన మరింత పెరిగిందనే చెప్పాలి. కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా కొన్ని ప్రముఖ సంస్థలకి బ్రాండ్ అంబాసిడర్ గా కూడావ్యవహరిస్తూ వస్తుంది.

9) నందు భార్య గీత మాధురి

9nandu-with-his-wife

ప్రముఖ నటుడు నందు కొన్ని చిన్న సినిమాల్లో హీరోగా కూడా నటిస్తూ వస్తున్నాడు. ఈమె భార్య గీత మాధురి కూడా సింగర్ గా రాణిస్తుంది. తన భర్తకి ఏమాత్రం తీసిపోకుండా ఈమె కూడా భారీగానే సంపాదిస్తుంది.

10) మహేష్ బాబు భార్య నమ్రత

10mahesh-babu-with-his-wife

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సంపాదన గురించి అయితే మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అలాగే ఆయన మిగిలిన బిజినెస్ లను అయన సతీమణి నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు. ఆమె కూడా చేతినిండా సంపాదిస్తూ మహేష్ కు తోడుగా ఉంటుంది.

 

Share.