పవన్, మహేష్, ఎన్టీఆర్, బన్నీ.. వీళ్లలో వెనక్కి తగ్గేది ఎవరు..!

ప్రస్తుతం ఉన్న పరిస్ధితిని బట్టి షూటింగ్ లు అన్నీ ఆపేశారు. జూన్ వరకూ కూడా తిరిగి ప్రారంభం అయ్యే అవకాశాలు లేవని తెలుస్తుంది. ప్రస్తుతం స్టార్ హీరోలు తమ ఇళ్ళలోనే ఉంటూ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఏప్రిల్ నెలలో చాలా సినిమాలు విడుదల చెయ్యాలి, చాలా షూటింగ్ లు పూర్తి చెయ్యాలి లేదా కొత్త షూటింగ్ లు మొదలు పెట్టాలి అని అనుకున్న వారికి నిరాశే మిగిలింది. ఆ తరువాత ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ లో విడుదల ప్లాన్ చేసుకున్న సినిమాలు కూడా రిలీజ్ డేట్ లు మార్చుకునే అవకాశం కూడా ఉంది.

ఈ క్రమంలో ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి భారీ బడ్జెట్ చిత్రం జనవరిలో వస్తోంది కాబట్టి.. ఆలోపు విడుదల సాధ్యం కాని సినిమాలు 2021 సమ్మర్ కి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కూడా ఉంది.ఇక 2021 సమ్మర్ కి పవన్ కళ్యాణ్ -క్రిష్ ల ‘విరూపాక్షి’ (వర్కింగ్ టైటిల్) విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా కూడా అదే నెలలో విడుదల చేస్తామని .. ప్రాజెక్ట్ ఆనౌన్స్ చేసినప్పుడే చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

Tollywood Star Heroes Targers Same Month1

ఇక అల్లు అర్జున్ -సుకుమార్ ల ‘పుష్ప’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని 2021 ఏప్రిల్ లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రభాస్ 20 కూడా ఈ ఏడాది వచ్చే అవకాశం లేదు కాబట్టి… 2021 సమ్మర్ కే విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అది కూడా ‘బాహుబలి2’ రిలీజ్ డేట్ కి అనుకుంటున్నారట ఆ చిత్రం టీం సభ్యులు. మరి వీటిలో ఎన్ని సినిమాలు ఈ నెలలో విడుదల అవుతాయో చూడాలి.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Share.