టాలీవుడ్ క్రేజీ హీరోకి.. కీర్తి సురేష్ తో ప్రాబ్లం ఏంటి ?

‘మహానటి’ చిత్రంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది కీర్తి సురేష్. ఓ పక్క తమిళ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తుంది. ఈమె నటించిన ‘పెంగ్విన్’ చిత్రాన్ని ఈమధ్యే ఒటిటి లో విడుదల చేసారు. సినిమాలో పెద్దగా మ్యాటర్ లేకపోయినా.. కీర్తి సురేష్ క్రేజ్ వల్ల ఈ చిత్రాన్ని ఎక్కువ మందే చూసారు. ఇప్పుడు కీర్తి సురేష్ కు చాలా డిమాండ్ ఉంది.అయితే ఆమె మాత్రం కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. ఆమె ఒప్పుకోవాలే దర్శక నిర్మాతలు కళ్ళకు అద్దుకుని మరీ తమ సినిమాల్లో ఎంపిక చేసుకోవడానికి రెడీగా ఉన్నారు.

కానీ ఆమె మాత్రం సెలెక్టీవ్ గానే సినిమాలు ఎంచుకుంటుంది. ఎంతో మంది హీరోలు కూడా కీర్తితో నటించాలని ఆసక్తి చూపుతున్నారు. అయితే ఓ క్రేజీ హీరో మాత్రం ఈమెను తన సినిమాలో తీసుకోవద్దు అని చెప్పాడట. ఆ హీరో మరెవరో కాదు నాగ చైతన్య. ‘లవ్ స్టోరీ’ పూర్తయ్యాక నాగ చైతన్య.. విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యబోతున్నాడు. ‘థాంక్యూ’ అనే పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట సమంత ను తీసుకోవాలి అని అనుకున్నారట. కానీ తరువాత ఆ ఆలోచన మార్చుకున్నట్టు తెలుస్తుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకుందాం అని దిల్ రాజు సిఫార్స్ చేశారట. కానీ నాగ చైతన్య మాత్రం ‘ఆమె వద్దు.. రష్మిక అయితే బెటర్’ అని చెప్పాడట. రష్మిక కూడా మంచి ఆప్షనే కాబట్టి.. కీర్తి ని చైతన్య ఎందుకు వద్దన్నాడు అని కారణాలు అడగకుండానే, దిల్ రాజు రష్మిక కు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. మరి రష్మిక ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి..!

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Share.