19 ఏళ్ళ ‘మనసంతా నువ్వే’ చిత్రం గురించి మనకు తెలియని సీక్రెట్..!

‘సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్’ బ్యానర్ పై ఎం.ఎస్.రాజు నిర్మాణంలో వి.ఎన్.ఆదిత్య డైరెక్ట్ చేసిన ‘మనసంతా నువ్వే’ చిత్రాన్ని ఎప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా నటించిన ఈ చిత్రం 175రోజుల వరకూ విజయవంతంగా ఎన్నో కేంద్రాల్లో ఆడింది. ఉదయ్ కిరణ్ ను స్టార్ హీరోని చేసిన చిత్రమిది. ఆర్.పి.పట్నాయక్ సంగీతమందించిన ఈ చిత్రంలో తూనీగా తూనీగా, చెప్పవే ప్రేమ.. వంటి పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

చిన్నప్పుడే విడిపోయిన ప్రేమికులు పెద్దయ్యాక ఎలా కలుసుకున్నారు? అందుకు దారి తీసిన పరిస్థితులేంటి? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.2001వ సంవత్సరం అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం ఈరోజుతో 19 ఏళ్ళు పూర్తి చేసుకోబోతుంది. ఇదిలా ఉండగా.. ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి హీరోగా ఉదయ్ కిరణ్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే తరువాత ఆ అవకాశం ఉదయ్ కిరణ్ కు దక్కిందట. ‘మనసంతా నువ్వే’ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో మరెవరో కాదు.. మన సూపర్ స్టార్ మహేష్ బాబు.

2001 టైములో యం.ఎస్.రాజు నిర్మాణంలో మహేష్ ఓ చిత్రం చెయ్యడానికి కమిట్మెంట్ ఇచ్చాడు. ఆ టైములో మన యం.ఎస్.రాజు గారు మహేష్ కు దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తో ‘మనసంతా నువ్వే’ కథను వినిపించారు. అయితే అప్పుడు మంచి కమర్షియల్ సినిమా చెయ్యాలని ఎదురుచూస్తున్న మహేష్.. ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసాడట. అలా అది ఉదయ్ కిరణ్ వద్దకు వెళ్ళింది. అటు తరువాత మహేష్- యం.ఎస్.రాజు నిర్మాణంలో ‘ఒక్కడు’ అనే బ్లాక్ బస్టర్ చిత్రం వచ్చింది.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Share.