రెమ్యూనరేషన్ పెంచాను కానీ.. అలాంటివి చేయడం లేదు

ఒక్కోసారి హీరోయిన్స్ రెమ్యూనరేషన్ విషయం రకరకాల గాసిప్పులు వినిపిస్తుంటాయి. అయిదు కోట్లు, పది కోట్లు తీసుకొంటుందని గాసిప్పు రాయుళ్ళు రకరకాలుగా రాసేస్తుంటారు. అయితే.. అవి హీరోయిన్ల కెరీర్ ను పెద్దగా ఎఫెక్ట్ చేయవనుకోండి. కానీ.. సదరు హీరోయిన్ కొత్త హీరోలతో లేదా యంగ్ హీరోలతో నటించడానికి ఫలానా నిబంధనలు పెట్టిందట, సదరు నిబంధనలు దర్శకనిర్మాతలను ఇరకాటంలో పడేశాయంట అనే వచ్చే వార్తలు మాత్రం హీరోయిన్లకు ఎక్కడ లేని తలపోట్లు తెచ్చిపెడుతుంటాయి.

Rashmika Mandanna Remuneration

ఇప్పుడు అలాంటి ఇష్యూనే ఫేస్ చేస్తోంది రష్మిక మండన్న. ప్రస్తుతం మహేష్ బాబు, అల్లు అర్జున్, కార్తీ లాంటి స్టార్స్ తో నటిస్తున్న ఆమె యంగ్ హీరోలతో నటించడానికి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అడుగుతోందని, రూల్స్ తోపాటు కొన్ని కండిషన్స్ కూడా పెడుతుందని వార్తలు హల్ చల్ చేస్తుండగా.. రష్మిక ఆ వార్తలను ఖండించింది. రెమ్యూనరేషన్ పెంచిన విషయం నిజమే కానీ.. దర్శకనిర్మాతలను ఇబ్బందిపెట్టే తరహాలో రూల్స్ ఏమీ పెట్టడం లేదని, నేను అలాంటిదాన్ని కాదని చెప్పుకొచ్చింది అమ్మడు.

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.