తమకు ఇష్టమైన వాళ్ళకు కార్లను ప్రెజెంట్ చేసిన హీరోల లిస్ట్..!

సినిమా హీరోల పారితోషికాలు కోట్లల్లో ఉంటాయన్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వాళ్ళ జీవిత శైలి కూడా అదే విధంగా ఎంతో కాస్ట్లీ గా ఉంటుంది. ఖరీదైన ఇల్లు, కారు, స్థలాలను కలిగి ఉంటారు. వాళ్ళు ధరించే దుస్తులు కూడా చాలా ఖరీదైనవే అయ్యి ఉంటాయి. అయితే వారి మనసు కూడా చాలా విశాలమైనదై ఉంటుంది పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు కూడా. తమకు ఇష్టమైన సన్నిహితుల కోసం ఖరీదైన లగ్జరీ కార్లను కూడా ప్రెజెంట్ చెయ్యడానికి వారు వెనుకాడడం లేదు.

ఇటీవల ప్రభాస్ తన ఫిట్ నెస్ ట్రైనర్ కోసం లక్షల విలువ చేసే కారుని బహుమతిగా ఇచ్చాడు.ఆ వెంటనే నితిన్ కూడా తన ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుములకు అంతేవిలువ గల కారుని ప్రెజెంట్ చేసాడు. కేవలం వీళ్లిద్దరు మాత్రమే కాదు.. గతంలో కూడా కొంతమంది హీరోలు తమకు ఇష్టమైన సన్నిహితుల కోసం ఖరీదైన కార్లను బహుమతులుగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ లిస్ట్ లో ఉన్నవాళ్ళందరినీ ఓ లుక్కేద్దాం రండి :

1) ప్రభాస్:

Prabhas gifts Range Rover to his fitness trainer

ఇటీవల తన ఫిట్నెస్ ట్రైనర్ అయిన లక్ష్మణ్ రెడ్డికి రూ.85లక్షల విలువ గల ఖరీదైన లగ్జరీ కారుని బహుమతిగా ఇచ్చాడు ప్రభాస్.

2) నితిన్:

వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న నితిన్ కు ‘భీష్మ’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చాడు దర్శకుడు వెంకీ కుడుముల. అందుకేనేమో నితిన్ … ఇతనికి రూ.85లక్షల విలువగల రేంజ్ రోవర్ కారుని ప్రెజెంట్ చేసాడు.

3) నాగశౌర్య:

‘ఛలో’ చిత్రం సూపర్ హిట్ అయ్యాక తన పేరెంట్స్ కు 1.25 కోట్ల విలువ గల పోర్స్చే 718 సైమన్ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు నాగశౌర్య.

4) రాంచరణ్:

చిరంజీవి 59వ పుట్టినరోజుకి గాను 1.25 కోట్ల విలువగల ల్యాండ్ క్రూజర్ వి8 కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు చరణ్.

5) నమ్రత టు మహేష్ బాబు:

మహేష్ బాబు 35వ పుట్టినరోజు సంధర్భంగా నమ్రత 1.5 కోట్ల విలువగల రేంజ్ రోవర్ వోగ్ కారుని ప్రెజెంట్ చేసింది.

6) మహేష్ బాబు:

‘1 నేనొక్కడినే’ ‘ఆగడు’ వంటి డిజాస్టర్ సినిమాలతో సతమతమవుతున్న మహేష్ బాబుకి.. ‘శ్రీమంతుడు’ వంటి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ను అందించాడు దర్శకుడు కొరటాల శివ. అందుకు గాను మహేష్ బాబు 2015 లో 50 లక్షల విలువగల ‘న్యూ ఆడి ఎ6’ కారుని కొరటాలకు బహుమతిగా అందించాడు.

Share.