రోడ్డు ప్రమాదానికి గురైన సీనియర్ డైరెక్టర్..!

గత ఏడాది చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ లిస్టు లో చాలా మంది సీనియర్ నటులు, కమెడియన్లు, రచయితలు మరణించారు. ఇక రాజశేఖర్ లాంటి సీనియర్ హీరో కూడా యాక్సిడెంట్ కు గురవ్వడం పెద్ద సంచలనం సృష్టించింది. ఇలా టాలీవుడ్ ప్రముఖులను మృత్యువు వెంటాడుతూనే ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఓ సీనియర్ డైరెక్టర్ కూడా ప్రమాదానికి గురవ్వడంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.

Tollywood Asst Director Injures In Road Accident1

విషయంలోకి వెళితే.. ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మల్లికార్జున రావు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం ఈయన పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈయన్ని చూడటానికి టాలీవుడ్ లోని ప్రముఖులు మల్లికార్జున రావు ఆరోగ్య పరిస్ధితి గురించి తెలుసుకోవడానికి వెళ్తున్నారని సమాచారం.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.