టాలీవుడ్ హీరోలకు చెల్లి – అక్క పాత్రలు చేసిన ఈ నటీమణులు ఇప్పుడెలా ఉన్నారో చూడండి..!

ఒక్కోసారి సినిమా కథ ప్రకారం హీరోయిన్ల పాత్రలకు సమానంగా.. హీరోల చెల్లెళ్ల పాత్రలు ఉంటుంటాయి. అదే సిస్టర్ సెంటిమెంట్ మూవీ అయితే.. హీరోయిన్ పాత్ర కంటే హీరో సోదరి పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది.అలాంటి సినిమాలు కూడా ఘనవిజయాలు సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. హీరోల చెల్లెలి పాత్రల వల్ల కథ మలుపు తిరగడాన్ని కూడా మనం చాలానే చూసాము. దాంతో అప్పటి వరకూ ఒకలా ఉన్న హీరోలో… కొత్త కోణం కనిపిస్తూ ఉంటుంది.సరే గతంలో హీరోకి అక్క లేదా చెల్లెలి పాత్రలో నటించిన చాలా మంది నటీమణులు ఇప్పుడు ఎలా ఉన్నారు?సినిమాల్లోనే నటిస్తున్నారా లేక వేరే వృత్తిలో స్థిరపడ్డారా? అనే సంగతులను తెలుసుకుందాం రండి :

1)మౌనిక :

‘శివరామరాజు’ చిత్రంలో ముగ్గురి అన్నల ముద్దుల చెల్లెలుగా నటించిన మౌనిక… అందరికీ గుర్తుండే ఉంటుంది. తర్వాత ఈమె ‘మా అల్లుడు వెరీ గుడ్’ ‘కొడుకు’ వంటి సినిమాల్లో నటించింది. అయితే ఈమె 2014 లో ఇస్లాం మతం తీసుకోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. అంతేకాదు తన పేరుని రహీమాగా మార్చుకుని 2015 లో చెన్నైకి చెందిన వ్యాపారి మాలిక్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.

2) మధుమిత :

శివబాలాజీ భార్య మధుమిత అందరికీ సుపరిచితురాలే..! ‘పుట్టింటికి రా చెల్లి’ చిత్రంలో అర్జున్ కు చెల్లెలి పాత్రలో నటించింది.అంతేకాదు ‘మన్మధుడు’, ‘నువ్వే నువ్వే’ వంటి చిత్రాల్లో కూడా ఈమె నటించింది. ప్రస్తుతం ఈమె ఓ యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తూ బిజీగా గడుపుతుంది.

3) సంధ్య :

ప్రేమిస్తే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంధ్య.. అటు తర్వాత ‘అన్నవరం’ చిత్రంలో పవన్ కళ్యాణ్ చెల్లెలిగా కనిపించింది. అటు తరువాత తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది. 2015లో చెన్నై కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి వెంకట్ చంద్రశేఖర్ ను వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది. ఈమెకు ఒక పాప కూడా ఉంది.

4)మంజూష :

కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కిన ‘రాఖీ’ లో ఎన్టీఆర్ చెల్లెలిగా కనిపించిన మంజూష తర్వాత కూడా పలు సినిమాల్లో నటించింది. అయితే ఇప్పుడు యాంకర్ గానే కొనసాగుతుంది.

5)కీర్తి రెడ్డి :

‘తొలిప్రేమ’ సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తరువాత ‘అర్జున్’ సినిమాలో మహేష్ బాబు అక్కగా నటించింది. అయితే మధ్యలో హీరో సుమంత్ ను ఈమె పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల విడిపోయింది. తరువాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని యూ ఎస్ లో సెటిల్ అయ్యింది.

6)శరణ్య మోహన్ :

నాని హీరోగా వచ్చిన ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమాలో హీరోయిన్ గా నటించిన శరణ్య… ‘కళ్యాణ్ రామ్ కత్తి’ సినిమాలో కళ్యాణ్ రామ్ చెల్లెలిగా కూడా నటించింది. తరువాత నటుడు అరవింద్ కృష్ణన్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది ఈ బ్యూటీ.

7)వాసుకి :

పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘తొలిప్రేమ’ సినిమాలో చెల్లెలి పాత్రలో కనిపించిన వాసుకి తరువాత ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.

8) దీపా వెంకట్ :

‘మనసిచ్చి చూడు’, ‘శ్రీరామ్’ వంటి సినిమాల్లో హీరోకి చెల్లెలి పాత్రలో కనిపించిన దీపా .. అటు తరువాత తమిళ సీరియల్స్ లో నటించింది. ఈమె మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా.! జ్యోతిక, సౌందర్య, సిమ్రాన్, గజాలా, సంజన, విద్యాబాలన్, శ్రీయ వంటి స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పేది ఈ బ్యూటీ. నయనతార నటించే ప్రతీ సినిమాకి ఈమెనే డబ్బింగ్ చెబుతూ వస్తోంది.

9) శ్రీదేవి విజయ్ కుమార్ :

‘వీర’ చిత్రంలో రవితేజ చెల్లెలిగా నటించిన శ్రీదేవి.. అంతకుముందు ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘ఈశ్వర్’, తరుణ్ ‘నిన్నే ఇష్టపడ్డాను’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. 2009 లో రాహుల్ అనే వ్యక్తితో పెళ్ళైన తరువాత ఈమె పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగానే ఉంటూ వస్తోంది.

10) కస్తూరి రవిశంకర్ :

కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు'(తమిళ్ లో ‘ఇండియన్’) సినిమాలో చెల్లెలి పాత్రలో నటించిన కస్తూరి తరువాత పలు చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. 2010 లో వచ్చిన రవితేజ ‘డాన్ శీను’ సినిమాలో అక్క పాత్ర కూడా పోషించింది. అయితే ప్రస్తుతం ‘ఇంటింటి గృహలక్ష్మి’ వంటి సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

Share.