Durga Rao: బిగ్ బాస్ రూల్స్ ఉల్లంఘిస్తున్న దుర్గారావు..?

సినిమా, టీవీ రంగాలలో పాపులారిటీని సంపాదించుకోవడం ఎంత ముఖ్యమో ఆ పాపులారిటీని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. సెలబ్రిటీలుగా ఫేమస్ అయిన తరువాత నోరు జారితే ఇబ్బందులు పడక తప్పదు. టిక్ టాక్ యాప్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న వారిలో దుర్గారావు ఒకరు. ఢీ షోలో పండు నాదీ నక్కలీసు గొలుసు పాటకు దుర్గారావును అనుకరిస్తూ స్టెప్పులు వేయడంతో దుర్గారావు మరింత ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం దుర్గారావుకు సినిమాలలో కూడా ఛాన్సులు వస్తున్నాయి.

ఈటీవీతో పాటు పలు టీవీ ఛానెళ్లు నిర్వహిస్తున్న ఈవెంట్లలో కూడా దుర్గారావు పాల్గొంటున్నారు. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 5కు దుర్గారావు ఎంపికైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దుర్గారావు కూడా పలు ఇంటర్వ్యూలలో బిగ్ బాస్ నిర్వాహకులు తనను సంప్రదించారని తనకు అవకాశం వస్తే తప్పకుండా బిగ్ బాస్ షోకు వెళతానని చెబుతున్నారు. బిగ్ బాస్ షో నిబంధనల ప్రకారం ఆ షోకు ఎంపికైనా షోలో పాల్గొనే వరకు ఆ విషయాన్ని వెల్లడించకూడదు.

సీజన్ 4 సమయంలో ఈ విధంగా బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నానని చెప్పడం వల్ల ఒక కంటెస్టెంట్ కు బదులుగా మరో కంటెస్టెంట్ ను ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. టిక్ టాక్ స్టార్ దుర్గారావు బిగ్ బాస్ షోకు వెళుతున్నట్టు ప్రచారం చేసుకుంటే అతను ఎంపికయ్యే అవకాశాలు తగ్గుతాయి. బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ 5కు దుర్గారావును నిజంగానే ఎంపిక చేస్తారో లేదో తెలియాంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Share.