ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండీ ఆమె ఎలిమినేట్ అయ్యిందట..!

‘కింగ్’ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్3’ విజయవంతంగా ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఇక ఈ వారం కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా జరిగింది. నిన్నటి ఎపిసోడ్ లో ఒక్కో హౌస్ మేట్ కు ఒకరి గురించి మరొకరు ఏం మాట్లాడుకున్నారు అనేది.. వీడియోలు ద్వారా చూపించి వారిలో ఉన్న కోపాన్ని బయటకు తెచ్చే ప్రయత్నం చేసాడు ‘బిగ్ బాస్’. మొదటి వారం నుంచి ఎలిమినేట్‌ కాబోయే కంటెస్టెంట్‌ ఎవరన్నది బిగ్‌బాస్‌ కంటే ముందుగానే షోను చూసే ప్రేక్షకులకు తెలిసిపోతోంది. అయితే అవి ఊహాగానాల వరకు అయితే పర్లేదు కానీ.. అనధికారికంగా వచ్చే అధికార వార్త అవుతోంది. ఎలిమినేషన్‌ కాబోతున్నది వీరే అంటూ శనివారమే లీకవుతోంది.

this-weekend-elimination-person-name-leaked-from-bigg-boss-house1

అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఎనిమిదో వారంలో ఎలిమినేషన్‌కు గురయ్యే కంటెస్టెంట్‌ ఎవరన్నది ముందే తెలిసిపోయింది. ఈ వారం హిమజ, శ్రీముఖి, మహేష్, పునర్నవి, శిల్ప చక్రవర్తి ఈ వారం నామినేషన్ లిస్టులో ఉన్నారు. వీళ్లలో ఎక్కువ భాగం శిల్పానే బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓట్ల విషయంలో కూడా ఈమెకు తక్కువగా పడుతున్నాయని తెలుస్తుంది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తి.. ఈ వారం బయటకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వచ్చిన వారంలో తనను నామినేట్‌ చేసేందుకు వీలుండదు.. కాబట్టి రెండో వారంలో అందరూ ఒకే కారణంతో ఆమెను నామినేట్‌ చేసేశారు. దీంతో శిల్పా నిష్క్రమణ తప్పలేదనిపిస్తోంది. అయితే ఎలిమినేట్‌ అయిన విషయం అధికారికంగా తెలియాలంటే ఆదివారం నాడు షో ప్రసారమయ్యే వరకు ఆగాలి.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.