చరణ్ అన్న ఇచ్చిన యాక్టింగ్ టిప్ బాగా పనికొచ్చింది: వైష్ణవ్ తేజ్

ఆల్రెడీ క్రికెట్ టీం అంత ఉన్న మెగా హీరోల బ్యాచ్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చి క్రికెట్ టీం ను ఫుట్ బాల్ టీంగా మార్చేసిన యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. అయితే.. డెబ్యు సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాక.. ఇప్పటికీ చాలా మంది హీరోల కలల క్లబ్ అయిన “50 కోట్ల క్లబ్”లో స్థానం సంపాదించేసుకొని యువ హీరోగా తన బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు వైష్ణవ్ తేజ్. మనోడు హీరోగా నటించిన “ఉప్పెన” బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక నిర్మాతలు ఖర్చుపెట్టినదానికి పదింతలు తెచ్చిపెడుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

ఈ సినిమాతో ఆడియన్స్ అభిమానంతోపాటు క్రిటిక్స్ మెప్పును కూడా పొందాడు వైష్ణవ్ తేజ్. అయితే.. తనకు ఈస్థాయిలో నటుడిగా, హీరోగా గుర్తింపు రావడం వెనుక రామ్ చరణ్ ఇచ్చిన టిప్స్ కీలకపాత్ర పోషించాయని ఇవాళ ఓ ప్రముఖ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు వైష్ణవ్. తన యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పిన వెంటనే ఎంకరేజ్ చేసింది పవన్ కళ్యాణ్ & చిరంజీవి అయితే.. నటుడిగా ఏ పాత్ర చేసినా,

ఎలాంటి సన్నివేశంలో నైనా కనురెప్పల కదలికతో ఎక్కువగా భావాన్ని ఎక్స్ ప్రెస్ చేయమని చరణ్ ఇచ్చిన టిప్ తనకు చాలా ఉపయోగపడిందని చెప్పుకొచ్చాడు వైష్ణవ్. అలాగే.. తన తదుపరి సినిమా కూడా కమర్షియల్ కొలమానం ఉంటూనే ప్రయోగాత్మకంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు వైష్ణవ్ తేజ్. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్-రకుల్ జంటగా నటించిన వెబ్ ఫిలిమ్ ను కూడా థియేట్రికల్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శకనిర్మాతలు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.