టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!

స్టార్ హీరోలంటేనే వాళ్ళ పారితోషికంగా భారీగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కో సినిమాకి రూ.40 కోట్ల నుండీ రూ.50 కోట్ల పారితోషికం ఉంటుంది. బాలీవుడ్ హీరోల పారితోషికాలకు మన వాళ్ళ పారితోషికాలు సమానంగా ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో దానికి అదనంగా శాటిలైట్ రైట్స్ లో కొంత వాటాను కూడా తీసుకుంటున్నారు.ఇలాంటప్పుడు వాళ్లకు ఖ‌రీదైన బంగ్లాలు, లగ్జరీ కార్లు… వంటివి ఉంటాయని ఎవ్వరికైనా తెలుస్తుంది! అయితే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే వీళ్ళకు సొంత విమానాలు కూడా ఉంటాయా? అని..! అందుతున్న సమాచారం ప్రకారం.. ఎక్కువగా మన టాలీవుడ్ హీరోలకు విమానాలు లేవట. మ‌న టాలీవుడ్లో కేవలం నలుగురు హీరోల‌కు మాత్రమే ప్రైవ‌ట్ జెట్ విమానాలు ఉన్నాయట. వాళ్ళెవ్వరో తెలుసుకుందాం రండి :

1) చిరంజీవి: మెగాస్టార్ కు సొంత జెట్ విమానం ఉంది. ఆయన తనయుడు రాంచరణ్ రూ.80 కోట్లు ఖ‌ర్చుపెట్టి దీనిని కొనుగోలు చేసాడట! మెగా ఫ్యామిలీ మొత్తం టూర్ల‌కు వెళ్ళేటప్పుడు దీనిని ఉపయోగిస్తారని సమాచారం‌!

2) ఎన్టీఆర్: మన యంగ్ టైగర్ కు కూడా జెట్ ఫ్లైట్ ఉంది‌! దాని ఖరీదు కూడా రూ.80 కోట్లని తెలుస్తుంది.

3) అల్లు అర్జున్: ‘నా పేరు సూర్య’ సినిమా టైములో సొంతంగా సొంతంగా జెట్ ఫ్లైట్ ను కొన్నాడట బన్నీ..!

4) నాగార్జున: కింగ్ నాగార్జున కు ఎప్పటి నుండో సొంత ఫ్లైట్ ఉందట. ఫ్యామిలీ టూర్లకు వెళ్ళేటప్పుడు అలాగే రెండు, మూడు సినిమాల్లో నటిస్తున్న తరుణంలో దీనిని వాడుతుంటారట. ఇటీవల అయితే ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కోసం అలాగే ‘బిగ్ బాస్4’ షూటింగ్ కోసం దీనిని ఉపయోగించారట.

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Share.