రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

గతంలో హీరోయిన్లు వెబ్ సిరీస్ లలో నటించడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించేవారు. ‘బిగ్ స్క్రీన్ పై కనిపించాల్సిన మనం.. బుల్లితెర పై కనిపించడమేంటి’ అన్నట్టు వారి వ్యవహార శైలి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కరోనా లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం ఓటిటిలనే నమ్ముకున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్లు కూడా అప్పటి వరకూ ఉన్న నామోషీ ఫీలింగ్ ను పక్కన పెట్టి.. వెబ్ సిరీస్ లలో నటించడానికి ముందుకు వస్తున్నారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ వల్ల పరభాషా ప్రేక్షకులకు కూడా చేరువయ్యే అవకాశం ఉందని హీరోయిన్లు భావిస్తున్నారు.అంతేకాదు పారితోషికాలు క్కూడా భారీగానే అందుతాయి. అలా ఇప్పుడు స్టార్ హీరోయిన్లు వరుసగా వెబ్ సిరీస్ లకు సైన్ చేస్తూ.. రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ లిస్ట్ లో ఉన్న హీరోయిన్లను ఓ లుక్కేద్దాం రండి :

1) సమంత అక్కినేని:

ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది సమంత గురించే..! 10ఏళ్లకు పైగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత త్వరలోనే.. ‘ది ఫ్యామిలీ మెన్ 2’ అనే హిందీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో పాటు ‘ఆహా’ లో ‘సామ్ జామ్’ అనే టాక్ షోని కూడా హోస్ట్ చేస్తుంది.

2)ఈషా రెబ్బా :

మన తెలుగమ్మాయి ఈషా రెబ్బా.. ఓ పక్క వరుస సినిమాల్లో నటిస్తూనే మరోపక్క ‘లస్ట్ స్టోరీస్'(వెబ్ సిరీస్) తెలుగు రీమేక్‌లో కూడా నటించబోతుంది.

3)రాధిక ఆప్టే:

తెలుగులో ‘లెజెండ్’ ‘లయన్’ వంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ రాధిక ఆప్తే కూడా.. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లలో కూడా బోల్డ్ పాత్రల్లో కనిపిస్తుంది.

4)కియారా అద్వానీ:

‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కియారా అద్వానీ కూడా ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. మరిన్ని వెబ్ సిరీస్ లకు కూడా ఈమె సైన్ చేసినట్టు సమాచారం.

5)కాజల్ అగర్వాల్:

కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న హార్రర్ వెబ్ సిరీస్‌లో నటిస్తుంది కాజల్. దాంతో పాటు ‘ఆచార్య’ ‘ఇండియన్2’ వంటి సినిమాల్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

6)నిత్య మేనన్ :

ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క… ‘బ్రీత్’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది నిత్య మేనన్.

7) అదితిరావ్ హైదరీ:

‘సమ్మోహనం’ ‘వి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అదితి కూడా హిందీ వెబ్ సిరీస్ లలో నటిస్తుంది.

8)సోనాక్షి సిన్హా:

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి కూడా.. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న వెబ్ సిరీస్‌లో నటిస్తుంది.

9)తాప్సీ:

ఈ అమ్మడు కూడా పలు వెబ్ సిరీస్ లలో నటించడం కోసం నెట్ ఫ్లిక్స్‌ వారితో ఒప్పందం కుదుర్చుకుందట.

10)సాయి పల్లవి:

వరస సినిమాలు నటిస్తూ బిజీగా ఉన్న సాయి పల్లవి ఓ హార్రర్ వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

11)ప్రియమణి:

ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రియమణి కూడా వరుసగా వెబ్ సిరీస్‌లలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.ఇప్పటీకే ‘ఫ్యామిలీ మెన్‌’ వెబ్ సిరీస్ లో మనోజ్ బాజ్‌పెయి భార్యగా నటించింది ప్రియమణి. ఇప్పుడు సెకండ్ సీజన్లో కూడా నటిస్తుంది.

12)తమన్నా :

‘సీటిమార్’ ‘అందాదున్’ రీమేక్, ‘గుర్తుందా శీతాకాలం’ వంటి చిత్రాల్లో నటిస్తూనే.. గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ’11th Hour’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది తమన్నా..!

13)టబు :

50 ఏళ్ళ వయసొచ్చినా ఇంకా వరుస సినిమాల్లో నటిస్తూనే.. వెబ్ సిరీస్ లలో కూడా హాట్ హాట్ పాత్రలు చేస్తుంది ఈ సీనియర్ స్టార్ హీరోయిన్.

Share.