‘తెల్లవారితే గురువారం’ టీజర్: ”మగధీర కాదు.. మర్యాదరామన్న”

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా.. ‘మత్తువదలరా’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు శ్రీసింహా నటించిన రెండో సినిమా ‘తెల్లవారితే గురువారం’. మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణికాంత్ గెల్లి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్లు, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

ఒక అమ్మాయిని ప్రేమించిన హీరోకి మరో అమ్మాయితో పెళ్లి కుదురుతుంది. దీంతో ఆ పెళ్లి నుండి తప్పించుకోవడానికి పారిపోవాలనుకుంటాడు. టీజర్ లో సన్నివేశాలన్నీ ఎక్కడో చూసినట్లే అనిపించినా.. శ్రీసింహా క్యూట్ లుక్స్, డైలాగ్స్ కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. యూత్ కి ఈ ట్రైలర్ కచ్చితంగా నచ్చే అవకాశాలు ఉన్నాయి. ”నువ్ నా నుండి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావ్.. మగధీర కాదు ఇక్కడ మర్యాదరామన్న” అని హీరో చెప్పే డైలాగ్స్ మెప్పిస్తాయి. కాల భైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ ని మరింత ఎలివేట్ చేసింది.

రొమాంటిక్ అండ్ ఫన్ జోనర్ లో తెరకెక్కించిన ఈ సినిమాను వారాహిచలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించారు. మార్చి 27న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.


చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Share.