భూమికకు 7 నంబర్ కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

సుమంత్ హీరోగా తెరకెక్కిన యువకుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది భూమికా చావ్లా. తొలి సినిమాతోనే నటిగా మంచి పేరును సంపాదించుకున్న భూమిక తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోని సినిమాల్లో కూడా నటించారు. పవన్ కళ్యాణ్ భూమిక కాంబినేషన్ లో వచ్చిన ఖుషీ, ఎన్టీఆర్ భూమిక కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి, మహేష్ భూమిక కాంబినేషన్ లో వచ్చిన ఒక్కడు సినిమాలు భూమిక సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

అయితే ఖుషీ, ఒక్కడు, సింహాద్రి సినిమాల ద్వారా భూమిక ఏ హీరోయిన్ కు లేని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఖుషీ పవన్ కళ్యాణ్ కు హీరోగా 7వ సినిమా కాగా మహేష్ కు హీరోగా ఒక్కడు, ఎన్టీఆర్ కు హీరోగా సింహాద్రి 7వ సినిమాలుగా ఉన్నాయి. ఈ మూడు సినిమాల్లో భూమిక హీరోయిన్ గా నటించగా ఆయా హీరోలకు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా ఈ సినిమాలు నిలిచాయి. మరో విధంగా చెప్పాలంటే కెరీర్ తొలినాళ్లలో పవన్, ఎన్టీఆర్, మహేష్ లకు స్టార్ హీరోలుగా గుర్తింపు దక్కడానికి 7వ సినిమాలే కారణమయ్యాయి.

అయితే కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్లు బాగానే ఉన్నా కొత్త హీరోయిన్ల రాకతో భూమికకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం భూమికా చావ్లా హీరోలకు అక్క, వదిన తరహా పాత్రల్లో నటించి సత్తా చాటుతున్నారు. భూమిక నిర్మాతగా కూడా మారి కొన్నేళ్ల క్రితం తకిట తకిట అనే సినిమాను నిర్మించగా ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఆమె సినీ నిర్మాణానికి దూరమయ్యారు. ఈ మధ్య కాలంలో ఎంసీఏ సినిమా భూమికకు మంచి పేరు తెచ్చిపెట్టింది. భూమిక 7 నంబర్ సెంటిమెంట్ గురించి తెలిసిన ఆమె అభిమానులు ముగ్గురు హీరోలకు భూమిక ఏడో నంబర్ సినిమాతో హిట్టివ్వడం మిరాకిల్ అని చెబుతున్నారు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.