బిగ్ బాస్ 4: సోహైల్ అందుకే 25లక్షలు తీసుకున్నాడా..?

బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ స్మార్ట్ గేమ్ ఆడతారని అందరికీ తెలిసిందే. అందులోనూ టాప్ – 5 లోకి వచ్చారంటేనే ఎంతలా తమ గేమ్ ని ఛేంజ్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక రీయూనియన్ లో నుంచి వచ్చినవాళ్లు ఏమాత్రం హింట్ ఇచ్చినా కూడా పార్టిసిపెంట్స్ కి అర్ధమైపోతుంది. చాలా స్మార్ట్ గా వాళ్ల గేమ్ ని మార్చేసుకుంటారు. ఇప్పుడు సోహైల్ 25లక్షలు డీల్ ని తీసుకుని హౌస్ లో నుంచి, ఫినాలే రేస్ లో నుంచి తప్పుకోవడానికి మెహబూబే కారణం అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నిజానికి వీళ్లిద్దరికీ ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ ప్రేక్షకులకి బాగా తెలుసు. రీయూనియన్ అప్పుడు దివితో గ్రాండ్ గా హౌస్ లోకి వచ్చిన మెహబూబ్ అద్దంపై సైగలు చేస్తూ సోహైల్ కి సిగ్నల్ ఇస్తున్న వీడియో ఒకటి బయటకి వచ్చింది. ఈ వీడియోలో నువ్వు మూడో ప్లేస్ లో ఉన్నావని, డబ్బులు తీసుకునే అవకాశం వస్తే వదులుకోవద్దని మెహబూబ్ సైగలు చేస్తున్నట్లుగా ఉందని నెటిజన్స్ ఆరోపిస్తున్నారు. అందుకే, సోహైల్ డబ్బులు తీసేసుకుని బిగ్ బాస్ ఫినాలేలో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడని చెప్తున్నారు.

ఇక సోహైల్ ఈ విషయాన్ని అఖిల్ తో కూడా పంచుకోలేదని, లాస్ట్ వరకూ ఉన్నా విన్నర్ అవ్వనని తెలిసి ఇలా డబ్బులు తీసుకుని బయటకి వచ్చాడని అంటున్నారు. అంతేకాదు, వీళ్లిద్దరి గురించే మాట్లాడుతూ నాగార్జున – చిరంజీవి కూడా బాగా సపోర్ట్ చేశారని, ఫేవరెటిజం అనేది చూపించారని ఆరోపణలు చేస్తున్నారు. అదీ విషయం.


Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Share.