అనసూయా చేస్తుంటే.. రష్మీ ఎందుకు చేయడం లేదు?

యాంకర్ అనే పదానికి సరికొత్త అర్దాన్ని చెప్పిన బ్యూటీలలో రష్మీ ఒకరు. అనసూయా కూడా గ్లామర్ క్వీన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ షోలో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండే ఈ యాంకర్స్ అప్పుడప్పుడు వెండితెరపై కూడా స్పెషల్ పాత్రల్లో కనిపిస్తూ ఉంటారు. ఇక ఛాన్స్ వచ్చినప్పుడు ఐటెమ్ సాంగ్స్ తో కూడా రచ్చ చేస్తున్నారు. అయితే అనసూయా రేంజ్ లో మాత్రం రష్మీ అవకాశాలు అందుకోవడం లేదనే చెప్పాలి.

జబర్దస్త్ ద్వారా దాదాపు ఇద్దరికి ఓకే రకమైన క్రేజ్ అయితే వచ్చింది. అయితే ఒక వైపు అనసూయ స్టార్ హీరోలతో సైతం అడుతుపాడుతూ స్క్రీన్ షేర్ చేసుకుంటే రష్మీ మాత్రం గుంటూరు టాకీస్ లెవెల్లోనే ఉండిపోయింది. కనీసం మీడియం రేంజ్ లో కూడా క్లిక్కవ్వడం లేదు. ఇక రష్మీ గౌతమ్ చాలా వరకు తనకు వచ్చే ఆఫర్స్ ను సైతం రిజెక్ట్ చేటున్నట్లు టాక్ వస్తోంది. ఐటెమ్ సాంగ్స్ కు అయితే అసలే ఒప్పుకోవడం లేదట.

పెద్ద ఛాన్సులు రావాలని అనుకుంటుందో లేక చిన్న చిన్న సినిమాలను చేయడం ఎందుకు అనుకుంటుందో ఏమో గాని రెమ్యునరేషన్ ఎంత ఇస్తామని అన్నా కూడా అమ్మడు తనకు ఇష్టం లేకపోతే మొహం మీదే చెప్పేస్తోందట. ఇక సపోర్టింగ్ రోల్స్ వచ్చినా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఈ బ్యూటీ ఏ మాత్రం ఒప్పుకోవడం లేదని టాక్. మరి బేబి రేంజ్ కు తగ్గట్లు పాత్రలు ఎప్పుడు క్రియేట్ అవుతాయో..

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Share.