నాని ‘వి’ మూవీని తొలగించమని కోర్టుకెక్కిన నటి..!

ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ‘వి’ చిత్రం కరోనా వైరస్ కారణంగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యింది. కాగా ఈ చిత్రం పేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడటం కంటే.. అమెజాన్ ప్రైమ్లో చూడటమే బెటర్ అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే నాని,సుధీర్ బాబు వంటి క్రేజ్ ఉన్న హీరోలు నటించిన చిత్రం కావడంతో.. ‘వి’ ని ఎక్కువ మంది ప్రేక్షకులే వీక్షించారు.ఇదిలా ఉండగా..తాజాగా ‘వి’ చిత్రాన్ని తక్షణమే అమెజాన్ ప్రైమ్ నుండీ తొలగించాలి అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ టాపిక్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది.

మేటర్ లోకి వెళితే.. ‘వి’ చిత్రంలో ప్రముఖ మోడల్ మరియు నటి అయిన సాక్షి మాలిక్ ఫోటోను ఉపయోగించుకున్నారని అంతేకాకుండా ఆమెను సెex వర్కర్ గా చూపుతూ విమర్శించారని.. స్వయంగా సాక్షి మాలిక్ నే కోర్టుకెక్కింది. ‘నా అనుమతి తీసుకోకుండా సినిమాలో నా ఫోటోని ఎలా వాడుకుంటారు’ అంటూ ఆమె కంప్లైంట్ లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. సాక్షి జారీ చేసిన పిటిషన్ తో జస్టిస్ పటేల్ ఏకీభవిస్తూ.. ఆమె ఆవేదన కరెక్టే అని.. ఇది చట్టవిరుద్ధమే అవుతుందంటూ పేర్కొన్నారు.

ఒక వ్యక్తి అనుమతి తీసుకోకుండా సినిమాల్లోని సన్నివేశాల్లో వారి ఫోటోలను తీసుకోకూడదు అంటూ జస్టిస్ పటేల్ చెప్పుకొచ్చారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేశారు. అయితే సాక్షికి సంబంధించిన సీన్ ను మాత్రమే ‘వి’ నుండీ తొలిగిస్తారా లేక సినిమా మొత్తాన్ని తొలగిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.