‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రమోషన్స్ డిలే వెనుక కారణం..!

విడుదలకు 3 నెలల టైం ఉన్నప్పటికీ.. ‘అల వైకుంఠపురములో’ ప్రమోషన్స్ ను ఓ రేంజ్లో మొదలుపెట్టారు ‘గీత ఆర్ట్స్’ వారు. అల్లు అరవింద్ గారి చిన్న సంస్థ అయిన ‘జి.ఏ2 పిక్చర్స్’ పై నిర్మించే చిన్న సినిమాలకు కూడా ప్రమోషన్ల విషయంలో ఎటువంటి లోటు చెయ్యరు. అలాంటిది తాజాగా వీరు నిర్మిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రానికి ప్రమోషన్లు పెద్ద స్థాయిలో నిర్వహించడం లేదు అనేది జోరుగా నడుస్తున్న చర్చ.

ఇప్పటికే విడుదల చేసిన టీజర్,ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ వంటివి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి. ఈ చిత్రంతో కచ్చితంగా అఖిల్ కు మంచి బ్రేక్ వస్తుందని అక్కినేని అభిమానులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కొన్ని రషెస్ చూసిన నాగ్ సైతం.. ఈ సినిమా పై కాన్ఫిడెంట్ గా ఉన్నాడని అందుకే నిర్మాతలను తొందరపెట్టడం లేదు అని టాక్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాన్ని జూన్ 19న విడుదల చెయ్యబోతున్నట్టు నిర్మాత బన్నీ వాస్ తెలిపారు.

అయితే మధ్యలో మెగాస్టార్ ‘ఆచార్య’, బాలయ్య – బోయపాటిల ‘బిబి3’, వంటి బడా సినిమాలు ఉన్నాయి. ఇంకా చాలా సినిమాలు విడుదలవుతున్నాయి కూడా..! వీటన్నిటిని తట్టుకుని ‘బ్యాచిలర్’ నిలబడాలి అంటే.. ప్రమోషన్స్ కూడా ఇప్పటి నుండీ షురూ చేస్తే బెటర్ అని కొందరు విశ్లేషకులు మరియు అక్కినేని అభిమానుల అభిప్రాయం.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.