మహేష్ కు అంత కాన్ఫిడెన్స్ ఏంటి…?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ను ‘డేరింగ్ అండ్ డాషింగ్’ అంటుంటారు. తన తండ్రి కృష్ణ లానే అస్సలు భయపడడు. రిస్క్ అని తెలిసినా ప్రయోగాత్మక సినిమాల్ని చేసి సక్సెస్ అయ్యాడు. డిజాస్టర్ సినిమాలు సైతం క్లాసిక్స్ గా మిగిలాయి అంటే ఆతని స్టోరీ సెలక్షన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే… మహేష్ తదుపరి చిత్రమైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాకి పోటీగా జనవరి 12 నే విడుదల చేయబోతున్నాడు.

ala-vaikunthapurramloo-vs-sarileru-neekevvaru

నిజానికి బన్నీ కంటే మహేష్ నే పెద్ద స్టార్. అయినప్పటికీ ఈరోజుల్లో స్టార్ తో సంబందం లేకుండా సినిమా బాగుంటేనే ప్రేక్షకులు చూస్తున్నారు అనడంలో సందేహం లేదు. అందులోనూ బన్నీ సినిమాకి దర్శకుడు త్రివిక్రమ్ అనే పెద్ద ఆయుధం ఉంది. అయినా లెక్క చేయకుండా అదే డేట్ కి మహేష్ రావాలని డిసైడ్ అవ్వడానికి కారణం అనిల్ రావిపూడి అనే తెలుస్తుంది. అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విధానానికి మహేష్ ఫిదా అయిపోయాడట. దీంతో కచ్చితంగా సినిమా హిట్ అవుతుంది అనే ధీమా ఏర్పడిందట. అందుకే మహేష్ ధైర్యం చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత అనిల్ రావిపూడి తో మరో సినిమా చేయడానికి కూడా మహేష్ ఆసక్తిని చూపుతున్నాడట. ఈ మేరకు మరో కథని కూడా సిద్దం చేయమని అనిల్ రావిపూడికి చెప్పాడట మహేష్.

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.