బిగ్ బాస్ 5: మొదటి కంటెస్టెంట్స్ ఇతనేనా?

బిగ్ బాస్ సీజన్ 4 ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కరోనా కష్ట కాలంలో దాదాపు మూడు నెలలకు పైగా ఆడియేన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించింది. అయితే సిజన్ 5 కోసం అప్పుడే చర్చలు మొదలైనట్లు సమాచారం. సీజన్ 4 అలా ముగిసిందో లేదో మరో సీజన్ పై గాసిప్స్ గుప్పుమన్నాయి. ఇక సీజన్ 5 కంటెస్టెంట్ లిస్ట్ పై కూడా అనేక రకాల రూమర్స్ వస్తుండడం విశేషం.

అందులో ముఖ్యంగా ఒక యూ ట్యూబ్ స్టార్ కంటెస్టెంట్ గా ఫిక్స్ అయినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అతను మరెవరో కాదు. పలు యూ ట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ తో మంచి క్రేజ్ అందుకున్న షణ్ముక్. మెయిన్ గా సాఫ్ట్ వేర్ డేవలపర్ అనే షార్ట్ ఫిల్మ్ సిరీస్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అతను బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు మొదటి కంటెస్టెంట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి.

నిజంగా ఈ రూమర్ ఎవరు ఊహించని విదంగా ఉంది. ఇక ఇటీవల స్టార్ మా బిగ్ బాస్ ను మిస్ అవుతున్నారా అనే పోల్ పెట్టడంతో పలు అనుమానాలు వస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో ప్లాన్ అయితే నడుస్తున్నట్లు అర్ధమవుతోంది. మరి అఫీషియల్. ఎనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Share.