ఇప్పుడు 50 కోట్లు.. అప్పుడు 1500 రూపాయలు మాత్రమే..!

‘ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు.. కాబట్టి లౌక్యంతో పాటు ఇతరులతో నెమ్మది కలిగి ఉండడం కూడా చాలా ముఖ్యం’ అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. చాలా రకాలుగా ఇది ప్రూవ్ అయ్యింది కూడా.! ముఖ్యంగా సినీ రంగంలో మనం చూసుకుంటే.. ఓ సాధారణ బస్ కండక్టర్ అయిన మన రజినీ కాంత్ గారు.. ఇప్పుడు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అయ్యారు. ఆయన సినిమాకొచ్చి 70 కోట్ల వరకూ తీసుకునే స్థాయికి ఎదిగారు. అలాగే మరో స్టార్ హీరో కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉండేవాడట.

కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకి 50 కోట్లు తీసుకుంటున్నాడట. ఇంతకీ ఎవరా స్టార్ హీరో.. అని అనుకుంటున్నారా..? ఇంకెవరు మన అక్షయ్ కుమార్. ఇప్పుడు ఒక్కో సినిమాకి 50 కోట్లు తీసుకుంటున్న అక్షయ్ కుమార్ ను… బాలీవుడ్ దర్శక నిర్మాతలు.. తమకు దేవుడిచ్చిన గిఫ్ట్ గా ఫీలవుతారట. ఇతను ‘మినిమం గ్యారెంటీ హీరో’ అనే నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. ఏడాదికి 3 సినిమాలు తీస్తే.. మూడు సినిమాలు కూడా 100కోట్లు పైనే వసూల్ చేస్తాయి. అంతేకాదు మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటాడు.

That star hero worked as a waiter for Rs 1500-1

అలాంటి ఈ స్టార్ హీరో..అప్పట్లో బ్యాంకాక్ నగరంలోని ఓ రిచ్ హోటల్ లో వెయిటర్ మరియు చెఫ్ గా పనిచేసేవాడట. దానికి గాను 1500 రూపాయల జీతం అందుకునేవాడట. అలాంటి వ్యక్తి ఇప్పుడు..ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన సెలబ్రిటీల లిస్ట్ లో 6వ స్థానంలో నిలిచాడు. గత ఏడాది ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం అక్షయ్ 6వ స్థానంలో నిలిచాడు. నిజంగా ఇతని జర్నీ కూడా ఎంతో ఇన్స్పిరేషనల్.. అనే చెప్పాలి.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Share.