అశ్వ‌థ్థామ లో స్క్రీన్ ప్లే మ్యాజిక్ అలరిస్తుందట

నాగశౌర్య మాస్ హీరోగా తన పవర్ చూపించబోతున్నాడు. ఆయన నటించిన అశ్వ‌థ్థామ కొద్దిరోజులలో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ పై ద్రుష్టి పెట్టిన చిత్ర యూనిట్ నిన్న ట్రైలర్ విడుదల చేశారు. సీరియస్ కంటెంట్ తో కూడిన హైఇంటెన్స్ ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ట్రైలర్ తరువాత చిత్రం పై అంచనాలు పెరిగిపోయాయి. నాగశౌర్య మాస్ హీరోగా ఖచ్చితంగా హిట్ కొట్టేలా కనిపించాడు. కాగా ఈ మూవీ గురించిన ఆసక్తికర వార్త మరోకటి బయటికి వచ్చింది.

Ninne Ninne Song From Aswathama Movie1

అశ్వ‌థ్థామ మూవీని బలమైన కథతో దర్శకుడు చిత్రికరించాడట. అలాగే ఈ మూవీ స్క్రీన్ ప్లే ప్రేక్షకుడికి మంచి అనుభూతిని పంచుతుంది అని సమాచారం. ప్రేక్షకులను ఆకట్టుకొనే అనేక అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని తెలుస్తుంది. వైజాగ్ వేదికగా జరిగే మెడికల్ మాఫియా పై ఓ యువకుడు చేసే యుద్ధమే ఈ అశ్వ‌థ్థామ అని తెలుస్తుంది. నూతన దర్శకుడు రమణ తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మెహ్రిన్ హీరోయిన్ గా నటిస్తుంది.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Share.