రాజుగారి గది 3కి బాలీవుడ్ హంగులు, స్పెషల్ సాంగ్

తమన్నా తప్పుకోవడంతో వేరే దారి లేక చైల్డ్ సీరియల్ ఆర్టిస్ట్ టర్నడ్ హీరోయిన్ ఆవికా గోర్ ను పెట్టుకొని “రాజుగారి గది 3” షూటింగ్ ను జరిపిస్తున్న ఓంకార్ కు ఈ సినిమాలో ఏదైనా స్పెషల్ అట్రాక్షన్ ఉండాలని భావించి.. బాలీవుడ్ యాక్టర్ & కొరియోగ్రాఫర్ స్నేహా గుప్తా చేత ఒక ఐటెమ్ సాంగ్ చేయించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. బాలీవుడ్ లో పలు డ్యాన్స్ షోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకొన్న స్నేహకి ఇది తెలుగులో మొదటి అవకాశం.

that-scene-will-be-highlight-in-raju-gari-gadhi-3-movie1

ఓంకార్ తమ్ముడు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. “కాంచన” తరహాలో ఈ సిరీస్ లో వచ్చిన మొదటి రెండు సినిమాలు హిట్ అవ్వడంతో మూడో భాగం మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి కానీ హైప్ మాత్రం రావడం లేదు. మరి ఈ స్నేహ గుప్తా సాంగ్ ఏమైనా హైప్ క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి.

Share.