బోయపాటితో గొడవేంటో..!

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి రామ్-లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ గా పని చేస్తున్నారు. మాస్ ఆడియన్స్ లో రామ్-లక్ష్మణ్ లకు మంచి క్రేజ్ ఉంది. కాలానుగుణంగా మారే ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొత్త ఫైట్లు కంపోజ్ చేస్తూ ఇండస్ట్రీలో అగ్ర స్థానంలో దూసుకుపోతున్నారు ఈ ఇద్దరూ. మాస ఫైట్లు కంపోజ్ చేయాలంటే రామ్-లక్ష్మణ్ ఉండాల్సిందే.

గతంలో వీరిద్దరూ బోయపాటి సినిమాలకు పని చేశారు. ఇప్పుడు మరోసారి ఈ డైరెక్టర్ తో కలిసి పని చేస్తున్నారు. దీంతో సినిమాలో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని అందరూ భావించారు. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరూ బోయపాటి సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. బోయపాటితో వచ్చిన మనస్పర్థల కారణంగానే రామ్-లక్ష్మణ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు టాక్. బోయపాటి వ్యవహారం నచ్చకపోవడంతో ఎలాంటి గొడవ చేయకుండా సైలెంట్ గా సినిమా నుండి తప్పుకున్నారట.

ఇప్పుడు వారి స్థానంలో స్టెంట్ శివని తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ బోయపాటితో వచ్చిన గొడవేంటనే విషయం మాత్రం బయటకి రాలేదు. ఇక సినిమా విషయానికొస్తే.. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.