వకీల్ సాబ్ అప్డేట్స్ తో రచ్చ చేస్తున్న తమన్

ఒక సినిమా మొదలైంది అంటే.. అభిమానులు కోరుకునేది రెగ్యులర్ అప్డేట్స్. కానీ.. ఒక పెద్ద హీరో సినిమా మొదలైంది అంటే కనీసం ఆరు నెలలవరకూ ఎలాంటి అప్డేట్స్ రావు. పాపం అభిమానులందరూ తమ హీరో సినిమాకి సంబంధించి ఫోటోలు లేదా అప్డేట్స్ ఎప్పుడు వస్తాయా అని అందరూ వెయిట్ చేస్తుంటారు. ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ కు కల్పతరువులా మారాడు సంగీత దర్శకుడు తమన్. మనోడు ఏ సినిమాకి వర్క్ చేస్తే ఆ సినిమా అప్డేట్స్ ను హీరోలకు రెగ్యులర్ గా అందించడమే కాక.. ఫ్యాన్స్ ట్వీట్స్ ను లైక్ చేస్తూ వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నాడు.

PSPK26 Team

ఇక నిన్న పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుష్ చేశాడు. పింక్ రీమేక్ గా రూపొందుతున్న “వకీల్ సాబ్” (వర్కింగ్ టైటిల్) ఫస్ట్ సాంగ్ త్వరలోనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ పాటను పవన్ ఆల్రెడీ విన్నారని, ఆయనకి నచ్చిందని కూడా తమన్ పేర్కొనడం విశేషం. దాంతో.. పవన్ ఫ్యాన్స్ అందరూ ప్రొడ్యూసర్ దిల్ రాజు కంటే తమన్ బెటర్ సినిమా అప్డేట్స్ ఇస్తున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.