తమన్ పర్సనల్ లైఫ్ కు సంబంధించి మనకు తెలియని నిజాలు..!

ప్రెజెంట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఈమధ్య అతను ఏ సినిమాకు సంగీతం అందించినా.. అందులోని పాటలు సూపర్ హిట్ అవ్వడం.. ఇతని మ్యూజిక్ వల్ల ఆ సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడడం మనం చూస్తూనే వస్తున్నాం. ‘వెంకీమామ’ ‘ప్రతీరోజూ పండగే’ ‘అల వైకుంఠపురములో’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లను సొంతం చేసుకున్నాడు తమన్. ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ ఆల్బమ్ ఓ మాస్టర్ పీస్ అనే చెప్పాలి. ఆ పాటలు దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయాయి.

అయితే గతంలో తమన్ పాటలకు ట్రోలింగ్ ఎక్కువ జరిగేది అన్న సంగతి అందరికీ తెలిసిందే. కొట్టిన ట్యూన్ లే.. పది సార్లు కొడతాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ‘తొలిప్రేమ'(2018) చిత్రం నుండీ రూటు మార్చి మంచి సంగీతం ఇస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తమన్ పర్సనల్ లైఫ్ గురించి ప్రేక్షకులకు ఎక్కువగా తెలీదు అనే చెప్పాలి. తమన్ భార్య పేరు శ్రీ వర్ధిని. ఈమె ఓ ప్లే బ్యాక్ సింగర్. అసలు చూడటానికి చాలా చిన్న పిల్లాడిలా కనిపించే తమన్ కు పెళ్ళయ్యిందా అని ఆశ్చర్యపడకండి.

Thaman having 14 years old child1

మరో ఆసక్తికరమైన సంగతి ఏంటి అంటే.. తమన్ కు 14 ఏళ్ళ కొడుకున్నాడట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో అఖిల్, నాగార్జున చెప్పుకొచ్చారు. ఇక తమన్ కు పెళ్ళయ్యింది అనే విషయాన్ని ఇటీవల మేగా మేనల్లుడు సాయి తేజ్ కూడా చెప్పుకొచ్చాడు. అసలు తమన్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు బయటకి రాలేదు అంటే.. సోషల్ మీడియా భారిన పడకుండా ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడో మనం అర్ధంచేసుకోవచ్చు.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Share.