కరోనాకి బలైపోయిన టాలీవుడ్ ప్రొడ్యూసర్..!

కరోనా ఇప్పుడు దేశవ్యాప్తంగా మరింత ఎక్కువగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది భయంకరంగా పెరుగుతుంది. సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు, మంత్రులు అందరూ దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం షూటింగ్‌లకు పర్మిషన్లు ఇవ్వడంతో సినీ సెలబ్రిటీలు, సీరియల్ సెలబ్రిటీలు కూడా కరోనా భారిన పడుతున్నారు. తెలంగాణలో నిన్న ఒక్క రోజే 2000 వరకూ కేసులు నమోదవ్వడం టెన్షన్ పెట్టే అంశం.

ఇదిలా ఉండగా తాజాగా.. తెలుగు సినీ నిర్మాత అయిన పోకూరి రామారావు గారు కూడా కరోనా కాటుకి బలైపోయారు. దీంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అల్లుకున్నాయి.’ఈతరం ఫిలింస్’‌ అధినేత అయిన పోకూరి బాబూరావు సోదరుడు పోకూరి రామారావు. గోపీచంద్ నటించిన చాలా సినిమాలకు ఈయన సమర్పకుడిగా పనిచేసాడు. ఈమధ్యనే రామారావుకు కరోనా పాజిటివ్‌ అన్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈయన్ని ఐసొలేషన్ వార్డ్ లో పెట్టి చికిత్స అందించారు.

అయినప్పటికీ పరిస్థితి చెయ్యి జారిపోవడంతో రామారావు తుది శ్వాస విడిచినట్టు తెలుస్తుంది. ఈయన వయసు 64 సంవత్సరాలు అని తెలుస్తుంది.

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Share.