ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి?

ఓ సినిమా పై క్రేజ్ ఏర్పడడానికి.. టైటిల్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలా అని క్రేజ్ కోసం ఏ టైటిల్ పడితే ఆ టైటిల్ పెట్టేస్తే.. జస్టిఫికేషన్ అవ్వదు. సినిమా కథను బట్టో.. లేదా అందులో హీరో, హీరోయిన్ల పాత్రలను బట్టో.. సినిమా టైటిల్ ను ఫిక్స్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. అయితే కొన్ని చిత్రాలకు చిత్ర విచిత్రంగా ఊరి పేర్లనే.. సినిమా టైటిల్స్ గా పెట్టేసారు. మరి ఊరిపేర్లను పెట్టుకున్న ఆ సినిమాలు ఏంటో.. వాటి రిజల్ట్ ఏంటో మీరే ఓ లుక్కెయ్యండి :

1) బొంబాయి :

మణిరత్నం తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ఇది. అరవింద్ స్వామి,మనీషా కోయిరాలా జంటగా నటించిన ఈ చిత్రానికి రెహమాన్ అందించిన మ్యూజిక్ హైలెట్ అని చెప్పొచ్చు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. ఈ చిత్రానికి ఊరి పేరు పెట్టడం విశేషం.

2) అరుణాచలం :

రజినీకాంత్ హీరోగా సుందర్.సి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ మూవీకి కూడా తమిళనాడు లోని ఓ ఊరి పేరే పెట్టారు.

3) భద్రాచలం :

శ్రీహరి హీరోగా ఎన్.శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రానికి పవిత్ర పుణ్యక్షేత్రం కలిగిన ఊరి పేరు పెట్టడం విశేషం. ఈ సినిమా కూడా హిట్ అయ్యింది.

4) అయోధ్య :

కృష్ణ, వడ్డే నవీన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కూడా అయోధ్య అంటూ రాముడి జన్మస్థలం పేరు పెట్టారు. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

5) తెనాలి :

కమల్ నటించిన కామెడీ చిత్రానికి గుంటూరు దగ్గర తెనాలి ఊరి పేరు పెట్టారు. తెలుగులో ఈ చిత్రం పెద్దగా ఆడలేదు.

6) శ్రీశైలం :

శ్రీహరి హీరోగా నటించిన ఈ చిత్రానికి కూడా ప్రఖ్యాతి చెందిన ఊరి పేరు పెట్టారు. ఈ చిత్రం యావరేజ్ గా ఆడింది.

7) అనంతపురం :

తమిళ సినిమాని తెలుగులో డబ్ చేస్తూ ఈ పేరు పెట్టారు. ‘కొంటె చూపుతో’ అనే పాట బాగా హిట్ అయ్యింది కానీ సినిమా పెద్దగా ఆడలేదు.

8) హనుమాన్ జంక్షన్ :

జగపతి బాబు, అర్జున్, వేణు నటించిన ఈ చిత్రానికి కూడా.. ఏలూరు దగ్గరి ఊరి పేరు పెట్టారు. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది.

9) కులుమనాలి :

ఫేమస్ టూరింగ్ ప్లేస్.. ఇది. శశాంక్, విమల రామన్ నటించిన సినిమా టైటిల్ కూడా..! అయితే ఈ సినిమా ఎప్పుడొచ్చిందో.. ఎప్పుడెళ్ళిపోయిందో కూడా చాలా మందికి తెలీదు.

10) భీమిలి కబడ్డీ జట్టు :

నాని నటించిన ఈ చిత్రానికి వైజాగ్ దగ్గర భీమిలి ఊరి పేరు పెట్టారు. కానీ ఈ చిత్రం పెద్దగా ఆడలేదు.

11) బెజవాడ :

నాగ చైతన్య హీరోగా నటించిన ఈ చిత్రానికి ఒకప్పటి విజయవాడ పేరు పెట్టారు. సినిమా మాత్రం ఆడలేదు.

12) కేరాఫ్ కంచరపాలెం :

2018 లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

13) రేణి గుంట :

తిరుపతి దగ్గర ఉండే ఊరు పేరుతో ఈ సినిమా వచ్చింది. కానీ సినిమా పెద్దగా ఆడలేదు.

14) అన్నవరం :

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సత్యనారాయణ స్వామి వారు కొలువై ఉన్న పుణ్యక్షేత్రం అన్నవరం పేరు పెట్టారు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

15) ద్వారక :

శ్రీ కృష్ణుడు జీవించిన చోటు ఇది. విజయ్ దేవరకొండ సినిమాకి టైటిల్ గా పెడితే.. ఆ సినిమా మాత్రం ఆడలేదు.

16) గంగోత్రి :

ఉత్తరాంఖండ్ లోని ఫేమస్ ప్లేస్ ఇది. మన బన్నీ నటించిన హిట్ సినిమా కూడా..!

17) సింహాచలం :

శ్రీహరి నటించిన యావేరేజ్ సినిమా ఇది. దీనికి కూడా ఊరు పేరు పెట్టారు.

18) బద్రీనాథ్ :

అల్లు అర్జున్ -వినాయక్ ల కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి కూడా ఉత్తరాంఖండ్ లోని అందుమైన పవిత్ర ప్రదేశం బద్రీనాథ్ పేరు పెట్టారు. సినిమా మాత్రం ఆడలేదు.

19) కాశీ :

చక్రవర్తి హీరోగా నటించిన ఈ చిత్రానికి పుణ్యక్షేత్రం అయిన కాశీ పేరు పెట్టారు. కానీ సినిమా పెద్దగా ఆడలేదు.

20) తిరుపతి :

అజిత్ నటించిన ఈ చిత్రానికి మరో పుణ్యక్షేత్రమైన తిరుపతి పేరు పెట్టారు. ఇది డబ్బింగ్ సినిమా..!

Share.