తెలంగాణ పోలీసులు నాకు పెన్షన్ ఇవ్వాలి : సంపత్ రాజ్

ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా విలన్, స్పెషల్ రోల్స్ లో నటిస్తూ సినిమాసినిమాకు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నారు సంపత్ రాజ్. చెక్ సినిమాలో సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సంపత్ రాజ్ ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న సంపత్ రాజ్ ఇంటర్వ్యూలలో ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

చెక్ సినిమా రియాలిటీకి ఎంత దగ్గరగా ఉండాలో అంత దగ్గరగా ఉంటుందని ఈ సినిమా ద్వారా తాను ఖైదీ జీవితాన్ని కళ్లారా చూశానని సంపత్ రాజ్ అన్నారు. భీష్మ మూవీలో పోలీస్ పాత్రనే చేసినా ఆ పాత్రలో ఫన్ ఉంటుందని ఈ సినిమాలోని పాత్రకు, ఆ పాత్రకు ఉండదని సంపత్ రాజ్ తెలిపారు. డైరెక్టర్ స్టోరీ చెప్పిన సమయంలోనే పాత్రను విజువల్ గా ఊహించుకున్నానని.. చెక్ మూవీలో డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్ గా నటించానని సంపత్ రాజ్ వెల్లడించారు.


అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమాలో కూడా తాను పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే నటిస్తున్నానని.. సినిమాల్లో ఎక్కువగా పోలీస్ రోల్స్ వస్తుండటంతో తెలంగాణ సర్కార్ కు, పోలీసులకు ఎక్కువగా పోలీస్ రోల్స్ లో నటిస్తున్నందుకు పెన్షన్ ఇవ్వాలని కోరతానని సంపత్ రాజ్ సరదాగా చెప్పారు. దర్శకుడిగా చంద్రశేఖర్ ఏలేటి టాలెంట్ గురించి అందరికీ తెలుసని చెక్ సినిమా వల్ల తాను, ఆయన మంచి ఫ్రెండ్స్ అయ్యామని సంపత్ రాజ్ అన్నారు.


గతంలో భవ్య క్రియేషన్స్ లో లౌక్యం సినిమాకు పని చేశానని అదే బ్యానర్ లో చేసిన చెక్ మూవీ లౌక్యంకు మించి హిట్ కావాలని కోరుకుంటున్నానని సంపత్ రాజ్ అన్నారు. . గత సినిమాల్లో రకుల్ కు తండ్రిగా, బ్రదర్ గా, కొలీగ్ గా కూడా చేశానని రకుల్ తో తాను నటించిన సినిమాలు అన్నీ హిట్టయ్యాయని రకుల్ తో నటించిన చెక్ కూడా రకుల్ తో తన కాంబినేషన్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అని ప్రూవ్ చేస్తుందని సంపత్ రాజ్ చెప్పారు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.