హిట్టు కోసం తన సినిమాకే సీక్వెల్ తీస్తున్న తేజ!

టాలీవుడ్ దర్శకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ. విభిన్న శైలిలో సినిమాలను రూపొందిస్తూ ఎన్నో హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకప్పుడు తేజ సినిమా అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉండేది. కానీ రాను రాను తేజ నుండి క్వాలిటీ సినిమాలు రావడం తగ్గాయి. వరుసగా డిజాస్టర్లు తీయడంతో ఆయన సినిమాలపై జనాలకు ఆసక్తి తగ్గింది. రానాతో చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా హిట్ అవ్వడం తేజకి కలిసొచ్చింది.

కానీ ఆ తరువాత తీసిన ‘సీత’ ఆశించిన ఫలితాన్నిఅందుకోలేకపోయింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని గోపీచంద్ హీరోగా ఓ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నాడు. ఇదిలా ఉండగా.. చాలా రోజులుగా తేజ డైరెక్ట్ చేసిన ‘చిత్రం’ సినిమాకి సీక్వెల్ వస్తుందని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై తేజ ఎక్కడా స్పందించింది లేదు. అయితే తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ ని అనౌన్స్ చేశాడు తేజ.

ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ‘చిత్రం 1.1’ షూటింగ్ ఈ ఏడాదిలో మొదలుకానుందని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ‘చిత్రం’ సినిమా అప్పట్లో ట్రెండ్ ని క్రియేట్ చేసింది. ఉదయ్ కిరణ్, రీమా సేన్ లు నటించిన ఈ సినిమా అప్పట్లో యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే తేజ ఎలాంటి స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడో మరి. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివున్నాయి!


Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.