బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ను కడిగి పారేసిన తనుశ్రీ

టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్, సాండల్ వుడ్ ఇలా అన్నీ ఉడ్స్ ను ఉతికారేసిన “మీటూ మూమెంట్” గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. తెలుగులో ఆ మూమెంట్ ను హైలైట్ చేసింది శ్రీరెడ్డి అయితే.. బాలీవుడ్ లో ఆ మూమెంట్ తో హల్ చల్ క్రియేట్ చేసింది మాత్రం తనుశ్రీదత్తా. నానా పటేకర్ మీద ఆమె చేసిన ఆరోపణల్లో నిజం లేదని బాలీవుడ్ జనాలు కొట్టిపడేసినప్పటికీ.. నానా పటేకర్ ఆమెతో అసభ్యంగా బిహేవ్ చేశాడని ఇప్పటికీ బల్ల గుద్ది మరీ చెబుతుంటుంది తనుశ్రీ దత్తా. కొన్నాళ్లుగా ఈ మీ టూ మూమెంట్ కనుమరుగవ్వడంతో.. తనుశ్రీ కూడా సైలెంట్ గా ఉండిపోయింది.

tanushree-dutta-fires-on-amir-khan1

అయితే.. నిన్న అమీర్ ఖాన్ బాలీవుడ్ దర్శకుడు సుభాష్ కపూర్ తో సినిమా ఎనౌన్స్ చేయడం.. హీరోయిన్స్ ను ఎక్కువగా సెక్స్ కోసం ఇబ్బందిపెట్టిన రికార్డ్ సుభాష్ కపూర్ కి ఉండడంతో ఆ ఎనౌన్స్ మెంట్ చర్చనీయాంశం అయ్యింది. అమీర్ ఖాన్ ను తనుశ్రీ దత్తా చాలా స్ట్రయిట్ గా “సుభాష్ కపూర్ మీద బాలీవుడ్ కి ఉన్న జాలి, కరుణ నా మీద ఎందుకు లేవు?” అని ప్రశ్నించింది. నిజమే మరి.. సుభాష్ కపూర్ మీద జాలిపడి అవకాశం ఇచ్చినప్పుడు తనుశ్రీ మీద బాలీవుడ్ దర్శకనిర్మాతలకు ఎందుకు జాలి లేదు.

Share.