తమ ఇంటి కరెంట్ బిల్లు చూసి షాకైన స్నేహ ఫ్యామిలీ..!

లాక్ డౌన్ వల్ల గత రెండు నెలల నుండీ ప్రజలంతా తమ ఇళ్ళల్లోనే ఉంటూ వస్తున్నారు. ఉద్యోగులు కూడా తమ ఇళ్ళల్లోనే ఉంటూ.. ‘వర్క్ ఫ్రం హోమ్’ లు చేస్తున్నారు. కొందరు టైం పాస్ కోసం టీవీలు చూస్తూ ఉంటారు. మరికొందరు మొబైల్ ఫోన్ లు ఎక్కువ వాడటం వల్ల .. ఎక్కువగా వాటికి ఛార్జింగ్ పెడుతూ ఉంటారు. ఇవన్నీ ఎంత రెగ్యులర్ గా చేసినా.. పెద్ద మొత్తంలో కరెంట్ బిల్లు వచ్చే అవకాశం ఉండదు. మరి ఎందుకో తెలీదు.. గత నెలలో అందరికీ భారీ రేంజ్లో కరెంట్ బిల్లులు వచ్చాయి.

దీంతో అందరూ షాక్ అయ్యారు. కేవలం సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా షాక్ అయ్యారు. ఆ లిస్ట్ లో మన తెలుగు హీరోయిన్ స్నేహ కూడా ఉంది. స్నేహ ఇంటికి ఏకంగా రూ.42, 632 బిల్లు వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త ప్రసన్న తన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. ‘లాక్‌డౌన్ టైములో ‘తమిళనాడు పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్’… ప్రజలను దోచుకుంటుందని ఎంత మంది భావిస్తున్నారు?’ అంటూ ట్వీట్ చేసాడు.దానికి నెటిజన్లు కూడా మద్దతు ఇస్తూ రిప్లైస్ ఇచ్చారు.

Tamil Nadu electricity board shocks actress Sneha1

‘మీరు మార్చి నుండీ కరెంట్ బిల్లు చెల్లించలేదు అందుకే మీకు రూ.42, 632 బిల్లు వచ్చిందని’ తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డ్ ప్రసన్న ట్వీట్ పై స్పందించింది. ‘మీరు పంపిన బిల్లు నేను ఎప్పుడో చెల్లించాను. కానీ మీరు ఎంతెంత బిల్లులు వేస్తున్నారో ప్రజలకు తెలియాలనే ఇలా ట్వీట్ చేశాను. కనీసం వారికి ఇ.ఎం.ఐ పద్ధతిలో బిల్లుని చెల్లించే సదుపాయం అయినా కల్పించండి’ అంటూ ప్రసన్న వారిని కోరాడు.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Share.