విజయ్ సినిమాకి మళ్ళీ షాక్..!

అదేంటో కానీ.. ఈ మధ్య తమిళ స్టార్ విజయ్ ప్రతీ సినిమాకి పెద్ద షాక్ తగులుతూనే ఉంది. రిలీజ్ కు ముందు ఏదో ఒక వివాదం చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే.. విజయ్ తాజా చిత్రం ‘బిగిల్’ కు కూడా ఓ సమస్య వచ్చిపడింది.

whistle-movie-release-date-fixed

‘బిగిల్ మూవీ ప్రీమియర్ షోస్ అనుమతించబోమంటూ ఉత్తర్వులు జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. దీనిని అతిక్రమించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొంది. దీంతో తమిళనాడులో ‘బిగిల్’ 25వ తేదీ దీపావళి రోజున మార్నింగ్ షో నుండి మాత్రమే ప్రారంభం అవుతుందని తెలుస్తుంది. అంతేకాదు రోజుకు కేవలం నాలుగు షోలు మాత్రమ ప్రదర్శిస్తారన్న మాట. ఇలా అయితే.. ఓపెనింగ్స్ కు దెబ్బ పడే అవకాశం ఉంది. తమిళనాడు ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కాదంబర్ రాజు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.