పెళ్ళికి సిద్దమవుతున్న మరో సినీ జంట..!

అల్లుఅర్జున్ ‘వరుడు’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరయ్యాడు కోలీవుడ్ హీరో ఆర్య. తరువాత ‘నేనే అంబానీ’ ‘ఆట ఆరంభం’ ‘సైజ్ జీరో’ ‘రాజా రాణి’ వంటి చిత్రాల‌తో తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించాడనే చెప్పాలి. ముఖ్యంగా ‘రాజా రాణి’ చిత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకి ‘హాట్ ఫేవరెట్’ అనే చెప్పాలి. తాజాగా ఆర్య… ఓ హీరోయిన్ డేటింగ్లో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు ‘అఖిల్’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన స‌యేషా సైగ‌ల్‌. వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారని… అందుకు వీరి పెద్దలు కూడా అంగీకరించారని గతకొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ వీరిద్దరి వివాహం త్వరలో జరుగబోతుందని కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. మార్చి 10 న వీరి వివాహం జరుగబోతోంది. 2018లో వ‌చ్చిన ‘గ‌జినీకాంత్’ అనే చిత్రంలో వీరిద్ద‌రు క‌లిసి న‌టించారు. అప్పటి నుండీ వీరిమధ్య ప్రేమాయణం జరుగుతున్నట్టు స్పష్టం అవుతుంది. ఇక వీరిద్దరిలో ఆర్య వయసు 38 కాగా.. సాయేషా వయసు కేవలం 21 మాత్రమే.. దాదాపు వీరిద్దరి మధ్య 17 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉండడం గమనార్హం. ప్ర‌స్తుతం సూర్య‌-కేవీ ఆనంద్ కాంబినేషన్ లో తెర‌కెక్కుతున్న ‘క‌ప్పం’ అనే చిత్రంలో కూడా వీరిద్దరూ కలిసి న‌టిస్తున్నారు. ఇందులో మోహ‌న్ లాల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. స‌యేషా హిందీలో ‘శివాయ్’ అనే చిత్రం చేయ‌గా… త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ‘వ‌న‌మ‌గ‌న్’ అనే చిత్రంతో ప‌రిచ‌యం అయ్యింది. స‌యేషా ప్ర‌ముఖ న‌టులు సుమీత్ సైగల్ మరియు షాహీన్‌ల కూతురు కాగా, దిలీప్ కుమార్, సైరా భానుల మ‌న‌వ‌రాలు అనే సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉండగా… వీరిద్దరి పెళ్ళి వేడుక హైద‌రాబాద్‌లో జ‌ర‌ప‌నుండ‌గా… చెన్నైలో గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటు చేస్తార‌ని కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.

Share.