Tamanna: మరో వెబ్ సిరీస్ లో మిల్కీ బ్యూటీ!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. దాదాపు అగ్ర హీరోలందరి సరసన కలిసి నటించింది. ప్రస్తుతం ఈమె నటించిన ‘సీటీమార్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలానే ‘ఎఫ్ 3’ సినిమా సెట్స్ పై ఉంది. ఇవి కాకుండా ‘మాస్ట్రో’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్యకాలంలో తమన్నా ఓటీటీలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. లాక్ డౌన్ కారణంగా ప్రేక్షకులంతా ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు.

ఈ క్రమంలో ఓటీటీ సంస్థలు ఒరిజినల్ కంటెంట్ పై దృష్టి పెట్టారు. దీంతో స్టార్ హీరో, హీరోయిన్లను వెబ్ సిరీస్ ల కోసం సంప్రదిస్తున్నారు. ఇప్పటికే కాజల్, సమంత లాంటి స్టార్లు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేశారు. తమన్నా కూడా ఇప్పటివరకు రెండు వెబ్ సిరీస్ లలో నటించింది. అందులో ఒకటి ‘లెవెన్త్ అవర్’ కాగా.. మరొకటి ‘నవంబర్ స్టోరీ’. ఈ రెండు సిరీస్ లు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయినప్పటికీ తమన్నా మాత్రం మరిన్ని వెబ్ సిరీస్ లలో నటించాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో అమెజాన్ సంస్థ నిర్మిస్తోన్న సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సిరీస్ ను పలు భాషల్లో నిర్మించనున్నారు. అరుణిమ శర్మ ఈ సిరీస్ ను డైరెక్ట్ చేయబోతున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Share.