బాత్ టబ్‌లో సొట్టబుగ్గల సుందరి

సొట్టబుగ్గల సుందరి తాప్సి అదృష్టం ఏమిటో గాని చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మొదట్లో టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె సోలో హీరోయిన్ గా ఒక్క పెద్ద సినిమాలో కూడా ఛాన్స్ అందుకోలేదు. అసలు ఆమె అందానికి అగ్ర హీరోయిన్ అవ్వడం కాయమని కెరీర్ మొదట్లోనే పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ లక్కు ఆమెను బాలీవుడ్ లోనే వరించింది. సాధారణంగా ఎవరైనా సరే టాలీవుడ్ లో సక్సెస్ కొట్టిన చాలా రోజుల తరువాత గాని బాలీవుడ్ లో అవకాశాలు ఎక్కువగా అందుకోలేరు.

అయితే తాప్సి మాత్రం ఇక్కడ పెద్దగా హిట్స్ లేకపోయినా నార్త్ ఇండస్ట్రీలో మాత్రం కుమ్మేస్తోంది. ఇక చాలా రోజుల తరువాత ఈ బ్యూటీ స్పెషల్ స్టిల్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బాత్ టబ్ లో ఒక ప్రముఖ ఫోటోగ్రాఫర్ తీసిన స్టిల్స్ ను అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. చీప్ థ్రిల్స్.. స్టిల్ థింకింగ్ వై.. అంటూ ఆలోచించే విధంగా తనదైన శైలిలో కామెంట్ కూడా జోడించింది. ఇక బాలీవుడ్ లో ఈ సొట్టబుగ్గల సుందరి చేతి నిండా ఆఫర్స్ పెట్టుకొని తిరుగుతోంది.

ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా టెంప్ట్ అవ్వకుండా తనకి సెట్టయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటోంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ `రష్మి రాకెట్`తో సిద్ధమవుతోంది. రాన్ ఆఫ్ కచ్ నుండి రన్నర్ గా తన గుర్తింపు కోసం పోరాడి అనుకున్నది సాధించిన మ్యారీడ్ అథ్లెట్ జీవిత ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Taapsee Pannu (@taapsee)


Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.