కావాలనే సినిమాల నుండి తప్పించేవారు!

బాలీవుడ్ ముద్దుగుమ్మ తాప్సి పన్ను తెలుగులో పలు చిత్రాలలో నటించి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తరువాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ వరుస విజయాలతో దూసుకుపోతుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టేసి కథా ప్రాధాన్యమున్న కథలను ఎన్నుకుంటూ సక్సెస్ రేట్ ను పెంచుకుంటోంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తన కెరీర్ లో చాలా అనుమానాలను ఎదుర్కొన్నట్లు చెప్పింది. బాలీవుడ్ లో, సౌత్ లో కావాలనే కొన్ని సినిమాల నుండి తనను తప్పించారని వెల్లడించింది.

ఒక సినిమా కోసం ఎంపిక చేసుకొని.. కొన్ని రోజుల తరువాత తనను ప్రాజెక్ట్ నుండి తీసేశారట. దానికి కారణం ఆ హీరో భార్యకి తాప్సి నచ్చలేదట. తన భర్త సరసన హీరోయిన్ గా తాప్సి వద్దని ఆమె చెప్పడంతో మరొక హీరోయిన్ ని తీసుకున్నారట. ఈ విషయాలను తాప్సి స్వయంగా వెల్లడించింది. అయితే ఆ హీరో ఎవరు..? అతడి భార్యకి తాప్సి ఎందుకు నచ్చలేదనే విషయాలను మాత్రం బయటకి చెప్పలేదు. మరో సినిమాలో హీరో కావాలనే తాప్సి ఇంట్రడక్షన్ సీన్ ని మార్పించారట. ఎందుకంటే హీరో పరిచయ సన్నివేశాన్ని తాప్సి సీన్ డామినేట్ చేస్తుందని అలా చేశారట.

Taapsee about that star actor1

ఇలా తన ముందే చాలా జరిగాయని.. వెనుక ఇంకెన్ని జరిగాయో తెలియదని తాప్సి వెల్లడించింది. అప్పటినుండి తనకు నచ్చిన సినిమాలు మాత్రమే అంగీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తాప్సి చెప్పింది. ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ లేడీ ఓరియెంటెడ్ కథలే చేసుకుంటూ పోతే తనకు కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు రావని.. హీరోలు తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోవడానికి ఇష్టపడరని చాలా మంది తనకు సలహాలు ఇచ్చారని.. కానీ తను మాత్రం మనసుకి నచ్చిన కథలనే చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Share.