హీరోయిన్ తాప్సీ కొత్తింటి ఫోటోలు వైరల్..!

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు డైరెక్షన్లో వచ్చిన ‘ఝుమ్మంది నాథం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. ఆ తరువాత కూడా కొంతమంది పెద్ద హీరోల సరసన నటించింది కానీ ఆశించిన బ్రేక్ రాలేదు. అయితే.. బాలీవుడ్ లో మాత్రం ఈమె చక్రం తిప్పుతుంది. అక్కడ వరుసగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ హిట్లు మీద హిట్లు కొడుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో చాలా ఆఫర్లు ఉన్నాయి.అక్కడ దర్శకనిర్మాతలు కూడా ఈమెతో సినిమా చేస్తే మినిమమ్ గ్యారెంటీ అన్నట్టు ఫిక్స్ అయిపోయారు.

ఇక గతేడాది ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్‌ బోతో ప్రేమలో ఉన్నట్టు కూడా ఈమె తెలిపిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు మరోసారి ప్రేమలో పడిందని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అంటే మొదటి బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిపోయిందా అని కంగారు పడకండీ..! తాప్సి కొత్తిల్లు కొనుగోలు చేసిందట. ఇప్పుడు దాంతో ప్రేమలో పడిపోయినట్టు చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. తాజాగా తన కొత్తింట్లో ఉన్న ఫర్నీచర్ మరియు గదులను వంటివి చూపిస్తూ ఫోటో షూట్లో పాల్గొంది తాప్సీ.

అతి త్వరలో గృహ ప్రవేశం కార్యక్రమం కూడా ఉండబోతుందట.’తాప్సి.. ఇల్లు అంటే స్నేహితులను కలిపేది.. ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి ఉండేది..పూర్తిగా ప్రేమను పంచే ప్రదేశం లాంటిది’ అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ.వైట్ శారీ… రెడ్ కలర్ బ్లౌస్ వేసుకుని తన చేతికి నిండుగా గాజులు ధరించి తాప్సి ఈ ఫోటో షూట్లో పాల్గొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

 

View this post on Instagram

 

A post shared by Taapsee Pannu (@taapsee)

1

2

3

4

5

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.