సైరా నరసింహ రెడ్డి మేకింగ్ వీడియో | మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ గా ‘సైరా’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. చిరు కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు రాంచరణ్. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, తమన్నా, అనుష్క వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘మెగా డాటర్’ నిహారిక కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అమిత్ త్రివేది సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

making-of-sye-raa-narasimha-reddy-movie

అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటి నుండీ ఈ చిత్రం ప్రమోషన్లు ఆగష్టు 14 నుండీ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ నెల 20వ తేదీన ముంబైలో ఒక ఈవెంట్ ను నిర్వహించి .. అదే వేదిక పై టీజర్ ను రిలీజ్ చేస్తారట. ఈ వేడుకలో అమితాబ్ .. చిరంజీవి .. విజయ్ సేతుపతి వంటి పలువురు ప్రముఖులు పాల్గొనబోతున్నారని సమాచారం.

Share.