నాన్ బాహుబలి కాదు ‘బాహుబలి’ నే పగిలిపోయేలా ఉంది..!

పదేళ్ళ తరువాత రీ ఎంట్రీ ఇచ్చినా తన స్థానం ఏమాత్రం చెక్కుచెదరలేదని ‘ఖైదీ నెం.150’ తో స్ట్రాంగ్ గా ప్రూవ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఆ సినిమా ఏకంగా 105 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ కి సైతం షాకిచ్చింది. ఇది పక్కన పెడితే… మొదటి స్వతంత్ర పోరాట యోధుడు అయిన ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ జీవితాన్ని ప్రేక్షకులకి చూపించాలని… ఉయ్యాలవాడ పాత్ర లో నటించాలనిది ఆయన డ్రీం. దీనిని ‘ఫుల్ ఫిల్’ చేయడానికి ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రాంచరణ్ ముందుకొచ్చాడు.

sye-raa-movie-trailer-review1

ఏకంగా 250 కోట్ల బడ్జెట్ తో మెగాస్టార్ 151వ చిత్రమైన ‘సైరా నరసింహా రెడ్డి’ ను నిర్మించాడు. సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ భారీ బయోపిక్ మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి స్టార్ క్యాస్ట్ ఉన్న ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదలకాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల డోస్ పెంచారు. ఇందులో భాగంగా ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.

sye-raa-movie-trailer-review2

‘భారత మాతకి జై’ అని చిరంజీవి అరుస్తూ చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ‘నరసింహ రెడ్డి కారణ జన్ముడు.. అతన్ని ఎవ్వరూ ఆపలేరు’ అనే డైలాగ్ తో మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ట్రైలర్ ఆరంభం నుండే మెగాస్టార్ ఎలివేషన్స్ అదిరిపోయాయి. అమిత్ త్రివేది అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతీ ఒక్కరికి ‘గూజ్ బంప్స్’ తెప్పించేలా ఉంది. శివలింగం దగ్గర్నుండీ మెగాస్టార్ ను చూపించే విజువల్ కు సినిమాటోగ్రఫీ రత్నవేలును మెచ్చుకోకుండా ఉండలేము.

sye-raa-movie-trailer-review3

ట్రైలర్ కి కావాల్సినంత ఎమోషన్, ఎనర్జీ ఉంది. ‘పాన్ ఇండియా’ సినిమాకి కావాల్సిన లక్షణాలు అన్నీ ‘సైరా నరసింహ రెడ్డి’ ట్రైలర్ లో పుష్కలంగా ఉన్నాయి. నిర్మాత రాంచరణ్ ఖర్చుకి వెనుకాడకుండా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి మెగా అభిమానులని మాత్రమే కాదు అన్ని భాషల ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని చాలా శ్రద్దతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అనిపిస్తుంది. చివర్లో మెగాస్టార్ చెప్పే ‘గెటవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్’ అనే డైలాగ్ హైలెట్ గా నిలుస్తుంది. మొత్తానికి ‘సైరా నరసింహ రెడ్డి’ ట్రైలర్ సినిమా పై అంచనాల్ని పెంచేసింది అని మాత్రమే కాదు.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే విధంగా కూడా ఉంది అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు.

Share.