కర్నూల్లో జరగాల్సి ఈవెంట్ కి ప్రకృతి సహకరించకపోవడంతో!

విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ.. “సైరా నరసింహా రెడ్డి” సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 18న ఈ చిత్రం ఆడియో వేడుకను కర్నూల్ లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ వేడుకలోనే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. అనంతరం తమిళ, మలయాళ, హిందీ వెర్షన్స్ కి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్స్ ను కూడా నిర్వహించేందుకు టీం సన్నద్ధమవుతోంది. మెగాస్టార్ అభిమానులు మాత్రమే కాక.. యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరూ ఈ సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

sye-raa-movie-pre-release-event-place-changed1

తొలుత ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ను కర్నూలులో నిర్వహించాలని చూసినప్పటికీ.. అక్కడ పరిస్థితులతోపాటు ప్రకృతి కూడా అంతగా సహకరించకపోవడంతో.. వెన్యూ హైద్రాబాద్ కి మార్చినట్లు తెలుస్తోంది. ఎల్ బి స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకి మెగాస్టార్, పవర్ స్టార్, మెగాపవర్ స్టార్, స్టైలిష్ స్టార్, సుప్రీం హీరో వంటి మెగా హీరోలతోపాటు పలు ఇండస్ట్రీలకు చెందిన వారు కూడా పాలు పంచుకొనే అవకాశాలున్నాయి.

Share.