భారీ రేటుకి ‘సైరా’ డిటిటల్ రైట్స్‌..!

మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఇది మెగాస్టార్ కు డ్రీం ప్రాజెక్ట్ కావడంతో ఆయన కొడుకు మెగా పవర్ స్టార్ రాంచరణ్.. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని 250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు.

characters-in-sye-raa-movie

ఇక మెగాస్టార్ స్టామినాతో ఈ చిత్రానికి భారీ రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 110 కోట్ల బిజినెస్ జరిగిందట. ఆంధ్రప్రదేశ్ లో 80 కోట్లకు అమ్ముడుపోగా.. నైజాంలో 30కోట్లకు అమ్మకాలు జరిగాయట. ఇక డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయినట్టు తెలుస్తుంది. ఏకంగా 40 కోట్లు పెట్టి ‘అమెజాన్ ప్రైమ్ ఇండియా’ సంస్థ ‘సైరా’ హక్కులని కొనుగోలు చేసిందట. అయితే అన్ని భాషలకు కలిపి ఈ మొత్తాన్ని చెల్లించినట్లు సమాచారం. విడుదలకు ముందే ఇన్ని రికార్డులు సృష్టిస్తుంటే.. విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి..!

Share.