యాత్ర సీక్వెల్ ను ఒకే చేసిన సూపర్ స్టార్ సూర్య

ఎన్టీఆర్ బయోపిక్ దారుణంగా విఫలమైన తరుణంలో వైయస్సార్ బయోపిక్ రిలీజ్ అవుతుంటే.. అందరూ “యాత్ర” కూడా ఫ్లాప్ అవుతుంది అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా “యాత్ర” సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా హిట్ అవ్వడం అనేది ఈ ఎలక్షన్స్ లో ఎలాంటి పాత్ర పోషించింది అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు 2019 ఎలక్షన్స్ లో జగన్ విశేషమైన మెజారిటీతో గెలిచాడు కాబట్టి ఈ 10 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా గెలవడం కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, గెలుపును ఎలా సొంతం చేసుకొన్నాడు? అనే నేపధ్యంలో “యాత్ర” సినిమాకి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు మహి వి.రాఘవ.

hero-surya-as-jagan-mohan-reddy1

ఈ విషయాన్ని దర్శకుడు మహి స్వయంగా ప్రకటించాడు ఇవాళ. త్వరలోనే సీక్వెల్ రాబోతోందని, యాత్ర అనేది జగన్ విజయ యాత్ర లేకుండా పూర్తవ్వదని క్లారిటీ ఇచ్చాడు మహి వి.రాఘవ. అయితే.. ఈ బయోపిక్ లో జగన్ గా తమిళ నటుడు సూర్య నటించనున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి “యాత్ర” సినిమాలోనే జగన్ పాత్రలో సూర్య అతిధి పాత్ర పోషించాల్సి ఉంది. కానీ.. ఆ సినిమాలో జగన్ కనిపించడం అవసరం లేదనుకొని అతడి పాత్రను కేవలం ఒక ఫోన్ కాల్ కు మాత్రమే పరిమితం చేశారు. అప్పుడు అలా మిస్ అయిన సూర్య ప్రెజన్స్ “యాత్ర” సీక్వెల్ లో పూర్తిస్థాయిలో కనిపించనుందన్నమాట. అసలే జగన్ గెలిచిన ఆనందంలో ఉన్న జనాలు “యాత్ర” సీక్వెల్ ను సూపర్ హిట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Share.