సురేంద్ రెడ్డి అక్కినేని వారసుడ్ని నిలబెడతాడా..?

అక్కినేని వారసుడిగా అఖిల్ తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చి చాలా యేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ బంపర్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోలేకపోయాడు. హలో, మిస్టర్ మజ్ను అంటూ కూల్ సినిమాలు చేసినా కూడా పెద్దగా మాస్ ఆడియన్స్ కి రీచ్ అవ్వలేకపోయాడు. పూర్తి స్థాయిలో అఖిల్ యాక్షన్ ని ప్రేక్షుకులు కూడా ఇంతవరకూ చూడలేదనే చెప్పాలి. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాని చేస్తున్న అఖిల్ ఈసారి గట్టి హిట్ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇందులో భాగంగానే డైరెక్టర్ సురేందర్ రెడ్డి అండ్ టీమ్ తో సినిమాని ఎనౌన్స్ చేశాడు. వీరిద్దరి కాంబోలో ఒక స్పై థ్రిల్లర్ రాబోతోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈసినిమాని మార్చి మొదటి వారం నుంచి షూటింగ్ మొదలుపెట్టబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అఖిల్ ని చాలా స్టైల్ గా చూపించేందుకు సురేంద్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నాడట. లాస్ట్ టైమ్ హిట్స్ లేక సతమతమవుతున్న రామ్ చరణ్ కి ధృవ సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు సురేందర్ రెడ్డి.

ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ని అఖిల్ కి కూడా వర్కౌట్ చేస్తూ అక్కినేని వారసుడ్ని ఇండస్ట్రీలో నిలబెడతాడని ఫ్యాన్స్ ఆశగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా పక్కా మాస్ అండ్ ఎంటర్ టైన్మెంట్ గా ఉండబోతోందని అంటున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదీ సంగతి.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.